టీ మీడియా,డిసెంబర్ 30,కరకగూడెం;
కరకగూడెం మండలంలోని సమత్ మోతె పంచాయతి పరిధిలోని రైతు కన్నీళ్లు తుడిచే వ్యవసాయ రంగానికి ప్రాముఖ్యత ఇచ్చే పులుసు బొంత ప్రాజెక్టు నిర్మాణ కొరకు రఘనాథపాలెం,బర్లగూడెం,తాటిగూడెం,వెంకటాపురం గ్రామాల రైతులు,ఇంజనీరింగ్,రెవెన్యూ,ఫారెస్ట్ అధికారులతో కెనాల్ రీ ఎలైన్ మెంట్ కోసం ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా రైతుల భవిష్యత్తు కోసం కెనాల్ రీ ఎలైన్ మెంట్ పై ఆధికారులతో పలు సూచనలను చూచించారు.
అనంతరం సీడీపీ నిధులు నుండి 10లక్షల వ్యయంతో మోతె,తాటిగూడెం పాఠశాలలకు ప్రహరి గోడ నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు.
అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులతో మూచ్చటించారు.అదే విధంగా తాటిగూడెం గ్రామ పాఠశాల వంట షెడ్డు ఏర్పాటు కోసం రేగా విష్ణు చారిటబుల్ ట్రస్ట్ నుండి 10,000/- రేగా కాంతారావు సహాయ చేశారు.
ఈ కార్యక్రమంలో ఈఈ బాబురావు,డీఈ నాగమల్లేశ్వర రావు,ఏఈ సక్రు,రెవెన్యూశాఖ ఆధికారి రాజు,ఫారెస్ట్ ఆధికారి సేవ్య,ఎంపీడీఓ శ్రీను,ఎంపీఓ చిరంజీవి,వివిధ గ్రామాల సర్పంచులు పోలెబోయిన నర్సింహారావు,కొమరం విశ్వనాథం,పోలెబోయిన పాపమ్మ,పాయం నరసింహారావు,బయ్యారం సీఐ రాజ గోపాల్,కరకగూడెం ఎస్ఐ గడ్డం ప్రవీణ్ కుమార్,పార్టీ నాయకులు అక్కిరెడ్డి వెంకట్ రెడ్డి,కొంపెల్లి పెద్ద రామలింగం,కొమరం రాంబాబు,చిట్టి సతీష్,జాడి రామనాథం,గుడ్ల రంజిత్ కుమార్,కొంపెల్లి చిన్న రామలింగం,జాడి నాగరాజు,ఎల్లు రామక్రిష్ణ రెడ్డి,కటకం లెనిన్ తదితరులు పాల్గొన్నారు.
