సిపిఎస్ ను రద్దు చేయాలి

సిపిఎస్ ను రద్దు చేయాలి

1
TMedia (Telugu News) :

సిపిఎస్ ను రద్దు చేయాలి

టీ మీడియా, మార్చి 10, బుగ్గారం :జగిత్యాల జిల్లాలోనిబుగ్గారం మండల కేంద్రంలో గల స్థానిక ప్రభుత్వ పాఠశాల ఆవరణలో, సిపిఎస్ ను తక్షణమే రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం బుగ్గారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న, పాఠశాల సముదాయ సమావేశాల సందర్భంగా, విరామ సమయంలో ఫ్లకార్డులు ప్రదర్శించి, నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ పిఈటి, పండిత పోస్టులను, అప్ గ్రేడ్ చేసి ఇ పదోన్నతులు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయులు బాల గంగాధర్, హరి కిరణ్, రవీంద్రనాథ్, గంగయ్య, సత్యనారాయణ, అశోక్, శ్రీధర్, నాగరాజు, వేణు, శ్రావణ్, రాజేష్ తదితరులు పాలుగోన్నారు.

Also Read : సర్కిల్ ఇన్స్పెక్టర్ కలిసిన గ్రీన్ భద్రాద్రి టీమ్.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube