కేసీఆర్ ని కలసి విజ్ఞప్తి చేయాల
-బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ట్రస్ట్ సమావేశం*
కేసీఆర్ ని కలసి విజ్ఞప్తి చేయాల బసవతారకం
-క్యాన్సర్ హాస్పిటల్ ట్రస్ట్ సమావేశం
-పాల్గొన్న హాస్పిటల్ బోర్డు మెంబెర్, ఎంపీ నామ
టీ మీడియా, , మార్చి 5,హైదరాబాద్ :నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు క్యాన్సర్ కి మెరుగైన వైద్యం అందించాలని ఎవరు క్యాన్సర్ వల్ల ఇబ్బందులు పడకుండా అండగా ఉండేందుకు స్థాపించిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ట్రస్ట్ బోర్డు సమావేశం శనివారం నాడు చైర్మన్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారి అధ్యక్షతన హాస్పిటల్ లోని సమావేశ మందిరంలో జరిగింది..ఈ సమావేశంలో హాస్పిటల్ ట్రస్ట్ బోర్డు మెంబెర్, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు శ్రీ నామ నాగేశ్వరరావు గారు పాల్గొన్నారు.. సమావేశంలో రోజు రోజుకి పెరుగుతున్న రోగుల అవసరాలను తీర్చే విధంగా తీసుకోవాల్సిన చర్యలపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు..
also read:భట్టి పాదయాత్రకు పలువురు సంఘీభావం
.దేశంలోనే మొదటి పది అత్యుత్తమమైన క్యాన్సర్ హాస్పిటల్స్ లో ఒకటిగా పేరు ప్రఖ్యాతులు కలిగిన బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ స్థాపించి 22 సంవత్సరాలు గడిచాయని మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎందరో క్యాన్సర్ రోగులకు వరదాయిని గా పేరు పొందిన బసవతారకం హాస్పిటల్ నాటి నుండి నేటి వరుకు దినదినాబివృద్ధి చెందుతూ 600 పైగా పడకలు కలిగి ప్రతి నిత్యం 2000 వేల మందికి పైగా ఔట్ పెషేంట్ లను మరియు 500 నుండి 600 మంది వరుకు ఇన్ పేషెంట్ లకు చికిత్స అందించే స్థాయికి చేరిందని చర్చించారు కేవలం అత్యధిక సంఖ్యలో చికిత్స అందించడమే కాకుండా వైద్య సేవలను అందరికి అందుబాటు ధరల్లో అందించాలని తన లక్ష్యానికి అనుగుణంగా అత్యాధునిక వైద్య సామాగ్రి, సాంకేతిక పరిజ్ఞానాన్ని హాస్పిటల్ నందు ఏర్పాటు చేయడం జరిగింది..
also read:రష్యాపై ఆంక్షలు… యుద్ధంతో సమానం: పుతిన్
ఇలా వైద్య సేవలు అందించడమే కాకుండా క్యాన్సర్ వ్యాధి రాకుండా అరికట్టేందుకు తీవ్ర స్థాయిలో నడుం బిగించి తెలంగాణ రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో ఉచిత వ్యాధి నిర్దారణ శిబిరాలు నిర్వహించడం లో బసవతారకం హాస్పిటల్ అగ్రగామిగా ఉంది.ప్రస్తుతం హాస్పిటల్ ను మరో 500 పడకల సరికొత్త క్యాంపస్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు అందుకు రాష్ట్ర ప్రభుత్వం నుండి స్థలం కేటాయించాలని అందుకు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలసి విజ్ఞప్తి చేయాలని బోర్డు నిర్ణయం తీసుకున్నారు.స్థలాన్ని ప్రభుత్వం కేటాయిస్తే వెను వెంటనే హాస్పిటల్ నిర్మాణానికి పూనుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.సమావేశంలో బోర్డు మెంబెర్స్ శ్రీమతి నారా బ్రహ్మాణి గారు, శ్రీ జె యస్ ఆర్ ప్రసాద్ గారు, డా.పొలవరపు రాఘవరావు గారు,డా.నోరి దత్తాత్రేయ గారు తో పాటు పలువురు పాల్గొన్
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube