బోల్తా పడ్డ కారు.. భారీగా బయటపడిన గంజాయి

బోల్తా పడ్డ కారు.. భారీగా బయటపడిన గంజాయి

1
TMedia (Telugu News) :

బోల్తా పడ్డ కారు.. భారీగా బయటపడిన గంజాయి

టీ మీడియా, మే 1,భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ గంజాయి పట్టుబడింది. సారపాకలోని భద్రాచలం వంతెన సమీపంలో గంజాయిని తరలిస్తున్న కారు అదుతప్పి బోల్తాపడింది. దీంతో కారులోని గంజాయి బయటపడింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

Also Read : ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ ఎంపీ

అయితే పోలీసులు వచ్చేలోపే కారు డ్రైవర్‌, అందులో ఉన్న వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కారును సీజ్‌ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గంజాయిని ఎక్కడి నుంచి ఎక్కడి తీసుకెళ్తున్నారనే విషయం తెలియాల్సి ఉన్నది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube