కారు బైకు డీ ఒకరు మృతి

కారు బైకు డీ ఒకరు మృతి

0
TMedia (Telugu News) :

                   కారు బైకు డీ ఒకరు మృతి

టీ మీడియా, ఏప్రిల్ 17, పెద్దపల్లి బ్యూరో : పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని గంగారం గ్రామ శివారులో హనుమకొండ నుండి మంచిర్యాలకు వెళ్తున్న TS,19 TA,3697 అనే కారు మంగపేటలోని తెనుగు పల్లె ప్రభుత్వ పాఠశాలలో హెడ్మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఆరేపల్లి శ్రీనివాస్, తన ఇద్దరు కుమారులతో మంగపేట నుండి శ్రీరాంపూర్ లోని తను నివాసం ఉండే ఇంటికి వస్తున్న క్రమంలో గంగారం గ్రామం దగ్గర కారు డి కొట్టడంతో తన పెద్ద కొడకైనా మనోక్షిత్, రెండవ తరగతి చదువుతున్న ఏడు సంవత్సరాల అబ్బాయికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. అతనిని పెద్దపల్లి జిల్లాప్రభుత్వ ఆస్పటల్ మార్చురికి తరలించడం జరిగింది. అలాగే ఆరేపల్లి శ్రీనివాసులు అతని చిన్న కొడుకు ఒకటవ తరగతి చదువుతున్నసాయి కీర్తన్ కు గాయాలు కాగా కాల్వ శ్రీరాంపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి స్థానికులు తరలించారు. అక్కడినుండి మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో కరీంనగర్ హాస్పటల్ కు తరలించారు. కాల్వ శ్రీరాంపూర్ ఎస్సై రాజ వర్ధన్ కారు డ్రైవర్ను స్థానిక పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

AlsoRead:స్వలింగ వివాహల‌ను మ‌ళ్లీ వ్య‌తిరేకించిన కేంద్రం

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube