కనీస సౌకర్యాల పై శ్రద్ధలేదు

నిబంధనల ఉల్లంఘన చేస్తున్న ఆసుపత్రులు

1
TMedia (Telugu News) :

కనీస సౌకర్యాల పై శ్రద్ధలేదు.

-నిబంధనల ఉల్లంఘన చేస్తున్న ఆసుపత్రులు

టి మీడియా మార్చి 14, మంచిర్యాల బ్యూరో:

మంచిర్యాల జిల్లాలో చాలా ఆసుపత్రులలో అగ్నిమాపక నిబంధనలు పాటించడం లేదని రైట్ టు హెల్త్ ఫోరమ్ రాష్ట్ర కార్యదర్శి గుమ్ముల శ్రీనివాస్ అన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. నిబంధనలు ఉల్లంఘిస్తున్న చేస్తున్న ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మీన మేషాలు లెక్కిస్తున్నారన్నారు. అధికారుల నిర్లక్ష్యం ఆసుపత్రుల ఉదాసీనత వలన రోగులు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందన్నారు. సేవ కన్నా వ్యాపారమే ధ్యేయంగా కొనసాగుతున్న ప్రైవేట్ ఆసుపత్రులు అగ్నిమాపక శాఖ నిబంధనలు అసలు ఏమాత్రం పాటించడంలేదని అన్నారు. అగ్నిమాపక శాఖ నుంచి అనుమతులు తీసుకోకుండానే హాస్పిటల్స్ నడుస్తున్నాయన్నారు. నిబంధనల ప్రకారం ఆస్పత్రులకు 15 మీటర్ల ఎత్తుతో ఐదువందల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో భవనాలు నిర్మించాలని, పూర్తిస్థాయిలో నీటి వసతి ఉండాలని, చుట్టూ అంబులెన్సులు, అగ్నిమాపక వాహనం తిరిగగలిగే విధంగాస్థలం ఉండాలన్నారు.

Also Read : మంత్రిని విమర్శించడం చిన్నారెడ్డికి తగదు

భవనం లోపల ర్యాంపు లతోపాటు, మెట్లదారి ఉండాలని,గాలి,వెలుతురు ధారాళంగా లొపలికి రావాలంటూ ఎన్నో నిబంధనలు ఉన్నా, ర్యాంపులు మెట్లదారి మినహా మిగతావేవి అమలు కావడం లేదన్నారు.ఆసుపత్రులకు కాసుల పై ఉన్న శ్రద్ధ కనీస సౌకర్యాల పై లేదన్నారు. నిబంధనలు ఉల్లంఘన చేస్తున్నఆసుపత్రులను మూసి వేసే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ దిశగా ప్రభుత్వం ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బోడెంకి చందు, జంబోది శ్రీనివాస్, చిట్టుమల్ల నరేందర్,కల్వచర్ల నాగభూషణం చారి తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube