దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

1
TMedia (Telugu News) :

దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
టి మీడియా, జూన్1,న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 2,745 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా వైరస్‌ బారినపడి ఆరుగురు మృతి చెందగా.. మరో 2,236 మంది బాధితులు కోలుకొని డిశార్జి అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 18,386 ఉన్నాయని కేంద్రం తెలిపింది.

Also Read : కువైట్ లో తిరుపతి మహిళకు విముక్తి

ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 0.60శాతంగా ఉందని పేర్కొంది.తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,31,60,832 చేరింది. ఇందులో 4,26,17,810 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు 5,24,636 మంది ప్రాణాలు వదిలారు. ఇదిలా ఉండగా.. దేశంలో టీకాల పంపిణీ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 1,93,57,20,807 టీకా డోసులు పంపిణీ వేసినట్లు వివరించింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube