కూలిన సైనిక హెలికాప్టర్‌.. 14 మంది మృతి

కూలిన సైనిక హెలికాప్టర్‌.. 14 మంది మృతి

1
TMedia (Telugu News) :

కూలిన సైనిక హెలికాప్టర్‌.. 14 మంది మృతి

టీ మీడియా, జులై 16,మెక్సికో సిటీ: సైనిక హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో దుర్ఘటనలో 14 మంది మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారని నావికాదళం తెలిపింది. సైన్యానికి చెందిన బ్లాక్ హాక్ హెలికాప్టర్ సినలోవా రాష్ట్రంలో కూలిపోయిందని అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు. ప్రమాద సమయం హెలికాప్టర్‌లో 15 మంది ఉన్నారని పేర్కొన్నారు.

 

Also Read : గోదావరి పరివాహక ప్రాంతాల్లో సీఎం కేసీఆర్‌ ఏరియల్‌ సర్వే

మెక్సికలో డ్రగ్‌ కింగ్‌గా పేరొందిన డ్రగ్‌ ట్రాఫికర్‌ రాఫెల్‌ కారో క్వింటెరోను నేవీ అరెస్టు చేసిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే హెలికాప్టర్‌ ప్రమాదానికి, రాఫెల్‌ అరెస్టుకు ఏమైనా సంబంధముందా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదని, ఈ విషయమై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. 1985లో అమెరికాకు చెందిన యాంటీ నార్కోటిక్స్‌ ఏజెంట్‌ హత్య కేసులో డ్రగ్ కింగ్‌ రాఫెల్‌ను నౌకాదళం అదుపులోకి తీసుకున్నది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube