లోక్ అదాలత్ లో 48 కేసులు పరిష్కారం

లోక్ అదాలత్ లో 48 కేసులు పరిష్కారం

2
TMedia (Telugu News) :

లోక్ అదాలత్ లో 48 కేసులు పరిష్కారం

టీ మీడియా,మార్చి12, మధిర: కోర్టులో జాతీయ లోక్ అదాలత్ ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి డి. ధీరజ్ కుమార్ అధ్యక్షతన దిగ్విజయంగా జరిగింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ బాధితులు, నేరారోపణ చేయబడిన వ్యక్తులు, ప్రతిష్టకు పోకుండా సాధ్యమైనంత వరకూ కక్షలు కార్పణ్యాలు దూరంగా సుహృద్భావ వాతావరణంలో కేసులను పరిష్కరించుకోవాలని, అలా పరిష్కరించుకుని చట్టబద్ధంగా శాంతియుతంగా జీవిస్తూ ఆదర్శ సమాజం నిర్మాణానికి అందరూ సహకరించాలని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.. మధిర ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో 48 కేసులు పరిష్కారం కాగా1968 కేసుల్లో నేరాన్ని అంగీకరించిన అందువల్ల 3,06,690 జరిమానా విధించారు. అదేవిధంగా అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో22 కేసుల పరిష్కారం కాగా నేరం అంగీకరించిన120 కేసులో కేసులలో2,62,510 జరిమానా విధించారు. అదేవిధంగా 5 సివిల్ కేసులు పరిష్కారం అయ్యాయి. ఈ కార్యక్రమంలో పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ,జన్ను భద్రయ్య పాల్గొనగా ముద్దాయిల తరపున సీనియర్ న్యాయవాదులు భైరవభట్ల శ్రీనివాస్ రావు, వాసంశెట్టి కోటేశ్వరరావు, జనార్దన్ రావు సుబ్రహ్మణ్యం, ఇంత గోపాల్ , పూర్ణచంద్రరావు, అవ్వ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Also Read : రాష్ట్రస్థాయి హాకీ టోర్నమెంట్లో జిల్లా వాసి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube