మేయర్ పై కేసు నమోదు 

మేయర్ పై కేసు నమోదు 

2
TMedia (Telugu News) :

ఓటు వేస్తూ ఫొటో దిగిన మేయర్- కేసు నమోదు                                                                                టీ మీడియా, ఫిబ్రవరి 20,కాన్పూరు :ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో అత్యంత కీలకమైన మూడో విడత పోలింగ్ ఆదివారం ప్రారంభమైంది. 59 శాసన సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. అత్యంత ప్రధానమైన 16 జిల్లాల్లో ఈ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ దశ పూర్తయితే ఉత్తర ప్రదేశ్ ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతోందో తెలుసుకునే అవకాశం కలుగుతుంది. ఆదివారం ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. 59 నియోజకవర్గాల్లో 627 మంది పోటీ చేస్తున్నారు. ఓటు వేసేందుకు 2 కోట్ల మంది అర్హులు. ఆదివారం ఉదయం 11 గంటల వరకు 21.18 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ, రైతులు బీజేపీని క్షమించరని, రాష్ట్రం నుంచి ఆ పార్టీని తుడిచిపెట్టేస్తారని చెప్పారు. మొదటి రెండు దశల్లో తమకు 100 సీట్లు లభిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి :రూ.60వేలు దాట‌నున్న బంగారం ధ‌ర‌?

అఖిలేశ్, ఆయన సతీమణి డింపుల్ సైఫాయిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జశ్వంత్ నగర్ నియోజకవర్గ పరిధిలో ఈ పోలింగ్ బూత్ ఉంది. అఖిలేశ్ యాదవ్ కర్హాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. కాన్పూర్ దేహాత్‌లోని భోగినీపూర్‌ 121వ నెంబరు పోలింగ్ బూత్‌లో సమాజ్‌వాదీ పార్టీ గుర్తుపై ఓటు వేస్తే, బీజేపీకి వేసినట్లు స్లిప్ వస్తోందని సమాజ్‌వాదీ పార్టీ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలు నిరాధారమని అదనపు ప్రధాన ఎన్నికల అధికారి బీడీ రామ్ తివారీ చెప్పారు.

ఇది కూడా చదవండి :తొలిసారిగా ఓటేసిన అవిభక్త కవలలు

ఇదిలావుండగా, కాన్పూర్ నగర జిల్లా కలెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం, కాన్పూరు మేయర్ ప్రమీల పాండే తన ఓటు హక్కును వినియోగించుకుంటూ, ఈవీఎంలో బీజేపీ గుర్తు కమలంపై ఓటు వేస్తున్నట్లు ఫొటో తీయించుకున్నారు. ఈ ఫొటోను షేర్ చేశారు. దీంతో ఆమెపై కేసు నమోదు చేశారు. హడ్సన్ స్కూల్ పోలింగ్ స్టేషన్‌లో ఆమె ఓటు వేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube