ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కేసు నమోదు
టీ మీడియా, మార్చ్ 7, నల్లగొండ : భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై నల్లగొండ జిల్లాలో కేసు నమోదైంది. చెరుకు సుధాకర్ కుమారుడు సుహాస్ ఫిర్యాదు మేరకు నల్లగొండ ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌లో 506 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తనను చంపుతానంటూ కోమటిరెడ్డి ఫోన్‌లో బెదిరించారని చెరుకు సుహాస్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎంపీ వెంకట్ రెడ్డితో తనకు ప్రాణహానీ ఉందని సుహాస్ తెలిపారు. వెంకట్ రెడ్డిపై నల్లగొండ జిల్లా ఎస్పీకి కూడా చెరుకు సుహాస్ నిన్న ఫిర్యాదు చేశారు.