ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ పై కేసు నమోదు చేయాలి

ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ పై కేసు నమోదు చేయాలి

1
TMedia (Telugu News) :

ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ పై కేసు నమోదు చేయాలి

 

టీ మీడియా, అక్టోబర్ 6, వనపర్తి బ్యూరో : గతంలో పోలీసు డిపార్ట్మెంట్ లో పనిచేసి ఎన్నో వేల మంది జీవితాలను కాపాడి, గురుకుల కార్యదర్శిగా ఎన్నో లక్షల విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్ది, ఈరోజు రాజకీయ రంగంలో ఎదురలేని బాణంగా దూసుకుపోతున్న బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను రాజకీయంగా ఎదురు కోవడానికి చేతకాక వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ పై రాష్ట్ర వ్యాప్తంగా ఎస్పీ లకు కంప్లైంటు చేయడంలో బాగంగా వనపర్తి జిల్లా ఎస్పీ కార్యాలయంలో, టౌన్ పోలీసు స్టేషన్ లో గురువారం కంప్లైంటు చేసి, వెంటనే ఎప్ఐఆర్ బుక్ చేసి అరెస్టు చెయ్యాలని వనపర్తి జిల్లా బహుజన సమాజ్ పార్టీ నాయకులు జిల్లా ఇన్చార్జీ గణపురం కృష్ణ, జిల్లా అద్యక్షులు నాగనమోని చెన్నరాములు ముదిరాజ్, ఉపాధ్యక్షులు చిరంజీవి, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ బహుజన రమేష్, వనపర్తి నియోజకవర్గం పార్టీ ప్రధాన కార్యదర్శి, శ్రీ రంగాపురం ఎంపిటీసి గూడెం ఎల్లస్వామి కోరారు.

Also Read : రావణసురుడి బొమ్మ కాల్చడం నీచమైన చర్య

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube