కులం పేరుతో దూషించిన జడ్పీ చైర్మన్

టీ మీడియా, మార్చి 9, వనపర్తి

1
TMedia (Telugu News) :

కులం పేరుతో దూషించిన జడ్పీ చైర్మన్

టీ మీడియా, మార్చి 9, వనపర్తి: వనపర్తి జిల్లా జడ్పీ చైర్మన్ అయిన రాకాసి లోకనాథ్ రెడ్డి అధికార అహంకారంతో మైనారిటీ వర్గానికి చెందిన జడ్పీ కోఆప్షన్ సభ్యులైన యండి ఉస్మాన్ కులం పేరుతో దూషించి చేయి చేసుకోవడం చాలా దారుణం ఈ విషయంపై వివిధ మైనారిటీ నాయకులు కలిసి కో ఆప్షన్ స్వగృహంలో అంత కలిసి మాట్లాడుతూ ముస్లింలు అంటే నీకు ఎందుకు అంత అసహనం ముస్లింల నీ కంటికి కనిపించడం లేదా ముస్లింల ఓట్ల మీకు అవసరం లేదా అని ప్రశ్నించారు. ఈ విషయంపై పోలీసులు కూడా జడ్పీ చైర్మన్ పై వెంటనే కేసు నమోదు చేయాలి మరియు జడ్పీ చైర్మన్ కూడా కో-ఆప్షన్ కు వెంటనే క్షమాపణ చెప్పాలని లేకపోతే రానున్న రోజుల్లో పార్టీలకు అతీతంగా దళిత మైనారిటీ బిసి వర్గాలకు చెందిన నాయకులు అందరూ ఏకమై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నామని హెచ్చరిస్తున్నాం.

Also read : వాహనదారులు కు అవగాహన

జరిగిన ఘటనపై మంత్రి నిరంజన్ రెడ్డి వెంటనే స్పందించి జడ్పీ చైర్మన్ పదవి నుండి తొలగించి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిజేఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు ఖాదర్ భాష ,టౌన్ అధ్యక్షులు రఘు నాయుడు, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు ఖయ్యాం టిఆర్ఎస్ నుంచి జహంగీర్, మైనారిటీ టౌన్ అధ్యక్షుడు అజీజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube