కులం, మతం కాదు.. గుణం చూసి ఓటెయ్యండి
– మంత్రి కేటీఆర్
టీ మీడియా, అక్టోబర్ 27, రాజన్న సిరిసిల్ల : కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే ఓట్లు దండుకోవడానికే కులమతాల పేరుతో కొందరు నాయకులు ముందుకు వస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కులం, మతం కాదు, గుణం చూసి ఓటెయ్యండి అని కేటీఆర్ పిలుపునిచ్చారు. అభివృద్ధి నా కులం, సంక్షేమం నా మతం. నేను పని చేస్తాను అనుకుంటేనే నాకు ఓటెయ్యండి అని కోరారు. సిరిసిల్ల పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ యువ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సమ్మేళనంలో యువకులు, బీఆర్ఎస్ యూత్ నాయకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. సిరిసిల్ల చరిత్రలో మొదటిసారి 2014లో సిరిసిల్ల ఎమ్మెల్యేకు మంత్రి పదవి వచ్చిందని కేటీఆర్ గుర్తు చేశారు. తనకో గుర్తింపు ఉందంటే, దానికి కారణం మీరే. పద్నాలుగు సంవత్సరాలుగా తన పనితీరు మీ ముందుంది. మీ తలరాత రాసుకునేది మీరే, దాన్ని మంచిగా ఉపయోగించుకొండి అని మంత్రి సూచించారు. ‘ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
Also Read : కేంద్ర సాయుధ బలగాలచే ప్లగ్ మార్చ్ కవాతు నిర్వహించిన
అదే సోషల్ మీడియాలో సమాధానాలు చెప్పండి. గతంలో సిరిసిల్లకు.. ఇప్పటి సిరిసిల్లకు తేడాను సోషల్ మీడియాలో ప్రచారం చేయండి. సిరిసిల్ల ఒకప్పుడు ఉరిసిల్లగా ఉండే, కాని ఇప్పుడు ఎలా అభివృద్ధి చెందిందో తెలపండి. నేతన్నా ఆత్మహత్య వద్దంటూ సిరిసిల్ల గోడలపై రాతలు ఉండేవి. సిరిసిల్లలో ఇన్ని విద్యాసంస్థలు వస్తాయని కలలో కూడా ఎవరూ అనుకోలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులందరూ సిరిసిల్ల, గజ్వేల్లోనే అభివృద్ధి అంటుంటే, సిరిసిల్ల నాయకులు మాత్రం సిరిసిల్లలో అభివృద్ధి ఏం లేదని అంటున్నారు. కేసీఆర్ న్యాయకత్వం మానేరును సజీవ ధారగా మార్చింది. దేశంలో ఎక్కడా లేని విధంగా సిరిసిల్లలో వర్కర్ టు ఓనర్ పథకాన్ని తీసుకొస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి అన్ని రంగాల్లో పురోభివృద్ధిని సాదిస్తున్నాం. కాంగ్రెస్, బీజేపీ వాళ్ళకు మాత్రమే అభివృద్ధి కనబడటం లేదు అని కేటీఆర్ పేర్కొన్నారు. ఓటుకు నోటు దొంగ ముఖ్యమంత్రి అవుతుండట, మెడమీద తల ఉన్నోడు ఎవడైనా ఇతడి చేతిలో రాష్ట్రాన్ని పెడతాడా? అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ దిక్కులేని స్థితిలో రాష్ట్రం ఇచ్చింది, కానీ ఇష్టపూర్వకంగా ఇవ్వలేదు. 55 ఏండ్లలో చేతకాలేదు కాని ఇప్పుడు అదిలేదు, ఇదిలేదు అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు.
Also Read : బైడెన్ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు
ఏ వారం, ఏ దేవుడు తప్పితే మీకేం తెల్వదు. రూ. 60 డిజీల్ ధరను రూ. 100, రూ. 70 రూపాయాల పెట్రోల్ ధరను 110 రూపాయాలు చేసినందుకు దేవుడా నరేంద్రుడు. ఎలక్షన్ అన్నపుడు ఆగంకాకుండా ఆచితూచి అడుగులు వేయండి. విజన్ ఉన్న నాయకుడు ప్రతిపక్షంలో ఒక్కడైనా ఉన్నాడా? ఇంటింటికి వచ్చి ఇది చేస్తాం, అది చేస్తాం అంటారు.. మాకు ముఖ్యమంత్రి కేసీఆర్, అన్న రామన్న ఉన్నాడని చెప్పండి’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube