Telugu News – T-MEDIA https://tmedia.net.in Thu, 18 Apr 2024 06:54:38 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.3.2  కార్పొ రెట్ విద్య సంస్థ ల దోపిడీ https://tmedia.net.in/exploitation-of-corporate-educational-institutions/ https://tmedia.net.in/exploitation-of-corporate-educational-institutions/#respond Thu, 18 Apr 2024 06:54:38 +0000 https://tmedia.net.in/?p=69714 paerntspaerntsటీ మీడియా, ఏప్రిల్ 18, హైదరాబాద్ బ్యూరో]]> paerntspaernts

 

కార్పొ రెట్ విద్య సంస్థ ల దోపిడీ

ప్రతీ ఏటా రుసుముల పెంపు

– ప్లేస్కూల్‌కు రూ.లక్ష..
ఒకటో తరగతికి రూ.2.5 లక్షలు*

-పుస్తకాలు, యూనిఫాంలూ బడిలో కొనాల్సిందే.
-యాజమాన్యాల ఇష్టారాజ్యం
-విద్య శాఖ లొ భోజ్యంలు
టీ మీడియా, ఏప్రిల్ 18, హైదరాబాద్ బ్యూరో :
ఇంకా నూతన విద్య సంత్యరం ప్రారంభం కాలేదు. అప్పుడే అడ్మిషన్స్ ప్రారంభం అయ్యాయి.కార్పొరేట్ విద్య సంస్థ లను మంధలించే పరిస్థితి లేదు. విద్య శాఖ లొ ఉన్న కొంతమంది భోజ్యం గాళ్ళు కార్పొరేట్ దోపిడీ దార్లకు సహాయం చేస్తూ అందుకు ఆర్ధిక ప్రతిఫలం పొందు తున్న రు. ఖమ్మం నగరం మామిళ్ల గూడెం లొ ఉన్న బాస్యం కార్పొరేట్ స్కూల్ ప్రవైట్ పురాతన భవనం లొ నడుస్తుంది. అనుమతి లేకుండ రెసిడెన్సీ స్కూల్ నడుపుతన్న రు. ఈ స్కూల్ కాం పౌండ్ కొంత కూలింది. మరికొంత కూలే దసలో ఉంది. శ్రీ చైతన్య స్కూల్ అపార్ట్ మెంట్ లొ నడుస్తోంది. ఇటువంటి వి అనేకం ఉన్నాయి.

 

హైదరాబాద్‌ ఉప్పల్‌లో చిరుద్యోగి ఆనంద్‌ తన కుమార్తెను ప్లేస్కూల్‌లో చేర్పించడానికి వెళ్లారు. నెలకు రూ.4 వేల చొప్పున సంవత్సరానికి రూ.48 వేల రుసుముతో పాటు యూనిఫాం, బూట్లు, బెల్టు, టై, ఇతరత్రా సామగ్రి కోసం రూ.12 వేలు కలిపి మొత్తం రూ.60 వేలు చెల్లించాలని యాజమాన్యం సూచించింది.*

హైదరాబాద్‌ కోకాపేటలో హరినాథ్‌ తన కుమారుడిని ఓ కార్పొరేట్‌ పాఠశాలలో ఒకటో తరగతిలో చేర్పించేందుకు యాజమాన్యాన్ని సంప్రదించగా.. రూ.లక్షన్నర ఫీజుతో పాటు ఇతరత్రా రుసుములు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు.*

వరంగల్‌లో కుమార్‌ తన కుమారుడిని మూడో తరగతిలో చేర్పించడానికి ఓ కార్పొరేట్‌ పాఠశాలకు వెళ్లారు. రూ.లక్ష డొనేషన్‌తో పాటు నెలకు రూ.8 వేల రుసుము, ఇతరత్రా ఛార్జీలు కలిపి మొత్తం రూ. రూ.2.5 లక్షలు అడిగారు.*

allso read:కరడుగట్టిన నేరస్తుల అడ్డా.

రంగారెడ్డి జిల్లాలోని ఒక అంతర్జాతీయ పాఠశాలలో ఈ ఏడాది 4వ తరగతికి రూ.2.60 లక్షల రుసుము ఉంది. వచ్చే సంవత్సరం ఐదో తరగతిలో రూ.3.12 లక్షల రుసుములు చెల్లించాలని తల్లిదండ్రులకు యాజమాన్యం సందేశం పంపింది.
ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో రుసుములు ఆకాశాన్నంటుతున్నాయి. ప్లేస్కూల్‌, ఎల్‌కేజీ, యూకేజీ, మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు.. డొనేషన్లు, అభివృద్ధి ఛార్జీలు, రుసుములతో పాటు పుస్తకాలు, దుస్తులు, బూట్లు, బెల్టుల పేరిట తల్లిదండ్రుల జేబులకు భారీగా చిల్లులు పెడుతున్నాయి. తమ పాఠశాలకు ఉన్న డిమాండ్‌ను బట్టి ఫీజులను ఇష్టారాజ్యంగా పెంచుతున్నాయి. ప్రభుత్వపరంగా రుసుముల నియంత్రణ లేకపోవడం వాటికి అనువుగా మారింది. 2024-25 విద్యాసంవత్సరానికి కొన్ని పాఠశాలలు ఏకంగా 25 శాతం వరకు ఫీజులు పెంచేశాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాలతో పాటు నగరాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. నగరాల్లోని పలు కార్పొరేట్‌ పాఠశాలలు 40-50 శాతం పెంచాయి.*

నిర్ణీత ప్రాతిపదిక లేకుండానే.

పాఠశాలల్లో ఏటా రుసుముల పెంపు ఆనవాయితీగా మారింది. నిర్ణీత ప్రాతిపదిక ఏమీ లేకుండానే 15 నుంచి 20 శాతం వరకు పెంచేస్తున్నాయి. కరోనా తర్వాతి సంవత్సరంలోనూ పెంపుదల ఆగలేదు. డిమాండ్‌ ఉన్న పాఠశాలలు మెరిట్‌ ఉన్న విద్యార్థులకే సీట్లు ఇస్తామని చెబుతున్నా.. అవీ భారీగా డొనేషన్లు వసూలు చేస్తున్నాయి. మరోవైపు యూనిఫాంలు, పుస్తకాలు, బ్యాగుల ధరలను పెంచేస్తున్నాయి. రూ.200కి లభించే చిన్నారుల బూట్లకు రూ.500 నుంచి రూ.1,000, మూడు జతల యూనిఫాంకు రూ.3 వేలు, బెల్టుకు రూ.300, టైకి రూ.300 చొప్పున ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. వీటిని బయట కొనుగోలు చేస్తామని తల్లిదండ్రులు వేడుకుంటున్నా ససేమిరా అంటున్నాయి. తాము ప్రత్యేకంగా తయారు చేయించామని, తమ పాఠశాల చిహ్నం ఉన్నందువల్ల ఇక్కడే కొనాలని కరాఖండిగా చెబుతున్నాయి. పుస్తకాలను సైతం బయటి మార్కెట్లో కొనడానికి ఒప్పుకోవడం లేదు. తాము చెప్పిన ముద్రణా సంస్థల పుస్తకాలనే కొనాలంటున్నాయి. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఒక పాఠశాలలో ఆరో తరగతి విద్యార్థుల నుంచి పుస్తకాల కోసం రూ.10 వేలు వసూలు చేస్తున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రుసుముల పెంపుతో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు పెనుభారం పడుతోంది. కొందరు అప్పులు చేసి మరీ పిల్లల ఫీజులు చెల్లిస్తున్నారు. గత మూడేళ్లుగా తన జీతం ఏమాత్రం పెరగలేదని, పాఠశాల రుసుములు మాత్రం 60 శాతం పెరిగాయని మంచిర్యాలకు చెందిన చిరుద్యోగి మహేందర్‌ వాపోయారు.
కార్యరూపం దాల్చని సిఫారసులు..

ప్రైవేటు పాఠశాలల్లో రుసుముల పెంపుదలపై ఎలాంటి నియంత్రణ లేకపోవడం యాజమాన్యాలకు వరంగా మారింది. భారీ రుసుములపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పాఠశాలల రుసుముల నియంత్రణ చట్టాన్ని తేవాలని 2022 జనవరి 17వ తేదీన జరిగిన మంత్రిమండలి సమావేశంలో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. 11 మంది మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. అది పలు సిఫారసులు చేసినా కార్యరూపం దాల్చలేదు.*

నియం యంత్రణకు నిర్దిష్ట విధానంపై దృష్టి*

ప్రైవేటు పాఠశాలల్లో రుసుములు ప్రతిఏటా పెరుగుతున్న మాట వాస్తవమే. అది సహేతుకం కాదు. రుసుములు భారమైనా తల్లిదండ్రులు వాటిల్లో చేర్పించేందుకు మొగ్గు చూపుతుండటం వల్లే ఈ సమస్య వస్తోంది. ఇప్పటివరకు ప్రైవేటు విద్యాసంస్థల్లో రుసుముల నియంత్రణకు నిర్దిష్ట విధానం లేదు. మంత్రివర్గ ఉపసంఘం గతంలో పలు సిఫారసులు చేసింది. వాటిని పరిశీలించి, ప్రభుత్వస్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.బుర్రా వెంకటేశం, తెలంగాణ విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి*

 

]]>
https://tmedia.net.in/exploitation-of-corporate-educational-institutions/feed/ 0
కరడుగట్టిన నేరస్తుల అడ్డా. https://tmedia.net.in/adda-of-hardened-criminals/ https://tmedia.net.in/adda-of-hardened-criminals/#respond Sat, 30 Mar 2024 16:26:32 +0000 https://tmedia.net.in/?p=69704 thihar jailthihar jailటీ మీడియా, మార్చి 30,ఢిల్లీ:]]> thihar jailthihar jail

-తీహార్‌ జైలు ప్రత్యేకతలెన్నో
టీ మీడియా, మార్చి 30,ఢిల్లీ:    దేశంలోని కరుడుగట్టిన నేరస్తులంతా ఉండేది తీహార్ జైలులో . సంచలన కేసుల్లో ప్రముఖ వ్యక్తి లేదా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌ అరెస్ట్ అయ్యారంటే వాళ్ల అడ్డా తీహార్ జైలే. అందుకే ఈ జైలు లోపల బయట హైసెక్యూరిటీతో.. నిరంతరం డేగ కళ్లతో నిఘా ఉంటుంది. దారుణమైన నేరాలకు పాల్పడ్డ రాజకీయ నాయకులు మొదలుకొని నేరం చేసే పారిశ్రామిక వేత్తలు, హంతకులు, ఉగ్రవాదులకు ఇదే కేరాఫ్ అడ్రస్. సంచలనం సృష్టించిన వేలాది కేసుల్లో నిందితులు తీహార్ జైలులోనే ఉన్నారు.

also read:అధికారిక (అహంకారం )దందా లు

ఎంతో మంది రాజకీయ నాయకులు సైతం ఇక్కడ ఊచలు లెక్కబెట్టారు. నేరాలు రుజువు కావడంతో ఎంతోమందిని ఈ జైలులోనే ఉరితీశారు.దేశ రాజధాని ఢిల్లీలో చాణక్యపురి నుంచి ఏడు కిలో మీటర్ల దూరాన ఉన్న తీహార్‌ గ్రామంలో ఈ జైలు ఉంది. దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద కారాగారం. 6 వేల 251 మందికి సరిపడ వసతులున్నా.. ఎప్పుడూ అంతకన్నా ఎక్కువ మంది.. అంటే పదివేలకు మించి ఖైదీలను ఉంచడం చూస్తుంటాం. వీరిలో న్యాయ విచారణను ఎదుర్కొంటున్న అండర్ ట్రయల్ ఖైదీలూ ఉంటారు. ఉదయం 5 గంటలకు చపాతీ, పూరీలు టిఫిన్ గా పెడతారు. మధ్యాహ్నాం పప్పు, అన్నం, సబ్జీ పెడతారు. రాత్రికి కూడా ఇదే మెనూ ఉంటుంది. వారానికి రెండుసార్లు ఖీర్ పెడతారు. ఇక ఖైదీలకు ఇక్కడ నాన్ వెజ్ ఫ్రీగా పెట్టరు. వారు కష్టపడిన డబ్బులతో.. క్యాంటీన్‌లో కొనుక్కుని తినాల్సి ఉంటుంది. కోర్టు అనుమతి ఉన్న ఖైదీలకు ప్రత్యేక వసతి, ఇంటి భోజనానికి అనుమతి ఉంటుంది. 2012లో ఢిల్లీ సామూహిక లైంగికదాడి కేసులో ఐదుగురు నిందితులను తీహార్ జైలులోనే ఉరి తీశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య కేసులో అత్యంత కీలకమైన కేహార్ సింగ్, సత్వంత్ సింగ్‌లను ఈ జైలులోనే నిర్భంధించారు. పారిశ్రామికవేత్తలను బెదిరించి వందల కోట్ల వసూళ్లకు పాల్పడ్డ సుకేష్ చంద్రశేఖర్, ఒలింపిక్ రజత పతక విజేత సుశీల్ కుమార్, కాశ్మీరీ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ ఇప్పుడు అక్కడే ఉన్నారు. 2 జి స్పెక్ట్రమ్ కేసులో అరెస్ట్ అయిన.రాజా, కనిమొళి.. లిక్కర్ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత.. ఇలా చాలామందిని తీహార్ జైలులోనే ఉంచారు.
]]>
https://tmedia.net.in/adda-of-hardened-criminals/feed/ 0
అధికారిక (అహంకారం )దందా లు https://tmedia.net.in/official-arrogance-danda-s/ https://tmedia.net.in/official-arrogance-danda-s/#respond Sun, 18 Feb 2024 09:27:27 +0000 https://tmedia.net.in/?p=69694 అధికారిక (అహంకారం )దందా లు

-అనుమతి లేకుండ ఆర్ అండ్ బి స్థలం లో నిర్మాణం లు

-అయిన వారి ఆదాయం కోసం షాప్ లు,టా యిలెట్స్

-పోస్టల్ శాఖ స్థలం లోను షాపింగ్ లు

– పేరుకు పోతున్న కరెంట్ బిల్లు
బకాయిలు

 

టి మీడియా, ఫిబ్రవరి 19, ఖమ్మం బ్యూరో : పరిసిలన కొద్దీ ఖమ్మం నియోజకవర్గం పరిధి లో గత ప్రభుత్వ కాలం లో జరిగిన అధికారిక దందాలు ఒక్కొక టి బైటకు వస్తున్నాయి. ఇప్పటి కె బుదందాలు, కబ్జా లు, రైతు బంధు, దళిత బందు, మైక్రొ ఇరిగేషన్ లాంటి వి టి మీడియా బైట పెట్టింది. తాజా గా రాష్ట్రం లో ఉన్న అధికారం, మున్సిపల్ పాలక పక్షం తమదే అవటం తో గత ప్రభుత్వ కాలం లో ఏకంగా ఎటువంటి అనుమతి లేకుండ నగరం లోని మయూరి సెంటర్, చర్చి కాంపౌండ్ ఆర్ అండ్ బి బ్రిడ్జి లు క్రింద, ఖానాపురం, సిటీ బస్టాండ్ ఎదురు గా ఆ శాఖ అనుమతులు లేకుండ, స్టేషన్ రోడ్ కూడలి లో విద్యాశాఖ అనుమతి లేకుండ పాఠశాల స్థలం లోస్వచ్ఛ భారత్ నిధులు తో ట్రయిలెట్స్, షాప్ లు నిర్మించరు. నాటి అధికార పార్టీ వారి కి కాట్రాక్ట్ కి ఇస్తే వారు వేరే వారికీ అధిక మొత్తం కు కిరాయి కి ఇచ్చారు. ఇది చాల దు అన్న ట్లు శ్రీనివాస థియేటర్ ఎదురు గా ఉన్న పోస్ట ల్ శాఖ కు చెందిన స్థలం లోను బడ్డి కోట్లు పెట్టించి దండు కొంటున్నారు. వీటి అన్ని కరెంట్ కనెక్షన్ లు ఖమ్మం మున్సిపల్ కమిషనర్ పేరున ఉన్నాయి. వాటి కి ఒక్కో కనెక్షన్ కు వెల ల్లో బిల్లు బకాయి లు ఉన్నాయి. ఇదంతా ఇట్లా ఉంటే మయూరి సెంటర్ బ్రిడ్జి క్రింద ఉన్న నిర్మాణం లు ను ఆర్ అండ్ బి అధికారులు, పోస్ట్ ఆఫీస్ వద్ద వి కొన్ని ఆ శాఖ వారు కూల్చి వేశారు.
అవినీతి స్వచ్ఛ భారత్

 

ఖమ్మం నగరం లో స్వచ్ఛ భారత్ పేరుతో జరిగిన నిర్మాణం ల లో భారీ అవి నీతి జరిగింది. నాణ్యమైన నిర్మాణం చెయ్యక పోవడం, సమందిత శాఖల అనుమతి లేకుండ అక్రమణ లు చేసిముఖ్య కుడళ్ళు అయినాస్టేషన్ రోడ్ లాంటి చోట షాప్ లు నిర్మాణం చేసి తమ అనుచరులు కు కట్ట బెట్టారు. లక్షల్లో ఈ అక్రము ఉంది

కరెంట్ బిల్లు ల కుంభ కోణం

అక్రమ నిర్ణమానాలు కు విద్యుత్ శాఖ కరెంట్ కనెక్షన్ లు ఇవ్వడం అనుమానం కలిగి స్తోంది.ఖమ్మం మున్సిపల్ కమిషనర్ పెరన మయూరి సేంట ర్ బ్రిడ్జ్ టా యిలెట్స్, షాప్ ల కు కలిపి సర్వీస్ నెంబర్ 02110-101589 ద్వారా కనెక్షన్ మంజురు చేసారు. క్యాటగి రి 2-ఎ లో ఉన్న ఈ కనెక్షన్ కి చెందిన నిర్మాణం లు 2నెలల క్రితం బ్రిడ్జి మారమ్మ త్తులు నేపథ్యంలో కూల్చి వేశారు. ఇంకా విద్యుత్ మీ టరు, స్థంభం పై కనెక్షన్ అట్లనే ఉంది. మున్సిపల్ శాఖ నుండి కనెక్షన్ తొలగించమని విద్యుత్ శాఖ కు లెటర్ ఇవ్వక పోవడం, 2023 మార్చి 14నుండి అసలు బిల్లు బకాయి ఉండటం కనెక్షన్ తొలగించక పోవడానికి కారణం గా తెలుస్తుంది. ఈ బకాయి ఎవరు చెల్లిస్తారు అన్న అనుమానం ఉండగా, 2023మార్చి నుండీ 2024 ఫిబ్రవరి 9వరకు, నిత్యం రద్దిగా ఉండే ప్రాంతము లోని టా యిలెట్స్, షాపింగ్ కి కేవలం రు 7,333లు బిల్లు అనుమానం కలిగి స్తోంది. మీటర్ ట్యామ్
పరింగ్ కూడా చేస్తున్నారు అన్న అనుమానం ఉన్నాయి.

మెటీరియల్ మాయం

మయూరి సెంటర్ బ్రిడ్జ్ క్రింద నిర్మాణా లు కూల్చి వేసిన అనంతరం అక్కడి షాప్ ల ష ట్టర్లు, తలుపు లు, రాళ్లు ఇతర మెటీరియల్ లు కనిపించడం లేదు. మెటీరియల్ వివరాలు ప్రత్యేకముగా నమోదు చెయ్యాలి అసలు ఉన్నయ అన్న అనుమానం కలుగు తోంది. గత ప్రభుత్వ కాలం లో అధికారికంగా ఖమ్మం నగరం లో జరిగిన దందాలు లో ఇది ఒక టి అనే అభిప్రాయం ఉంది.

 

]]>
https://tmedia.net.in/official-arrogance-danda-s/feed/ 0
ఇంకా అద్దె ఇంట్లోనే కార్యాలయాలు https://tmedia.net.in/offices-in-house-for-rent/ https://tmedia.net.in/offices-in-house-for-rent/#respond Tue, 09 Jan 2024 09:30:19 +0000 https://tmedia.net.in/?p=69683 టీ మీడియా, జనవరి 9, రేవల్లి :]]>

ఇంకా అద్దె ఇంట్లోనే కార్యాలయాలు

టీ మీడియా, జనవరి 9, రేవల్లి : వనపర్తి జిల్లా రేవల్లి మండలం కేంద్రంలో కొత్త మండలం ఏర్పడి ఎనిమిదవ వసంతంలోకి అడుగిడినా. మన మండలంలో ప్రభుత్వ కార్యాలయాలు మాత్రం అద్దె భవనంలోనే కొనసాగుతున్నాయి. అరకొర సౌకర్యాల మధ్య పాలన కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది. సరైన వసతులు లేక ఉద్యోగులు, ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. శాశ్వత భవనాలు కొన్ని మండల చోట్లనే నిర్మాణాలు జరుగుతున్నాయి. రేవల్లి మండలం కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ మాత్రం అద్దె భవనంలోనే కొనసాగిస్తున్నారు. మౌలిక వసతులు లేకపోవడంతో, ప్రజలు వచ్చే పనుల కోసం అవస్థలు పడుతున్నారని. మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తే కూర్చోవడానికి స్థలం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త భవనాల కోసం స్థలంలో శంకుస్థాపన చేసినప్పటికీ శాశ్వత భవనం నిర్మించడానికి వెనుకాడుతున్నారు.

Also Read : పంచముఖ ఆంజనేయునికి విశేష పూజలు

కొత్తగా ఏర్పాటైన ఈ మండలంలో పోలీస్ స్టేషన్, తహసిల్దార్ కార్యాలయలు ఓ ఇంటిలో ఇప్పటి వరకు అద్దెలో ఉంటూ నెల నెలా కిరాయి కడుతూ నెలకొల్పారు. తహసిల్దార్ కార్యాలయంకు నెలకు ఎంత అద్దె చెల్లిస్తున్నారనేది ఇప్పటివరకు ప్రజలకు తెలియదు, కానీ పోలీస్ స్టేషన్ కు ఆరు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల చెల్లిస్తున్నట్టు గ్రామస్తులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంలో కొత్తగా జిల్లాలు, మండలాలు ఏర్పడిన మన మండలంలో మాత్రం ప్రభుత్వ కార్యాలయాలు అద్దెలోనే ఉంటున్నాయని ప్రజలు చి చి సిగ్గుచేటు అంటూ నవ్వుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది ఇప్పుడన్నా మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయలకు భవనాలను అందుబాటులోకి తేవాలంటూ ప్రజలు కోరుతున్నారు.

]]>
https://tmedia.net.in/offices-in-house-for-rent/feed/ 0
పంచముఖ ఆంజనేయునికి విశేష పూజలు https://tmedia.net.in/special-pujas-to-panchamukha-anjaneya/ https://tmedia.net.in/special-pujas-to-panchamukha-anjaneya/#respond Tue, 09 Jan 2024 09:26:40 +0000 https://tmedia.net.in/?p=69680 టీ మీడియా, జనవరి 9, మేళ్ళ చెరువు :]]>

పంచముఖ ఆంజనేయునికి విశేష పూజలు

టీ మీడియా, జనవరి 9, మేళ్ళ చెరువు : సూర్యాపేట జిల్లా, మేళ్లచెరువు మండలం, మేళ్లచెరువు గ్రామంలో వేంచేసి ఉన్నశ్రీ 55 అడుగుల పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం స్వామివారి వారం మంగళవారం సందర్భంగా ఉదయం 6:00 గంటలకు పంచామృతాలతో అభిషేకం, 9:00 గంటలకు 21 సార్లు హనుమాన్ చాలీసా భజన కార్యక్రమాలు, భక్తుల సహాయ సహకారాలతో అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాలు జరిగాయి. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు, దేవాలయ చైర్మన్ శెట్టి రాజకుమార్ , పూజారి సుదర్శనం మోహన కృష్ణమాచార్యులు, బింగి కృష్ణ ప్రసాద్, భక్తులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Also Read : ఈడి చార్జిషీటులో రబ్రీదేవి, మీసాభారతిల పేర్లు

 

]]>
https://tmedia.net.in/special-pujas-to-panchamukha-anjaneya/feed/ 0
ఈడి చార్జిషీటులో రబ్రీదేవి, మీసాభారతిల పేర్లు https://tmedia.net.in/rabridevi-in-the-ed-chargesheet/ https://tmedia.net.in/rabridevi-in-the-ed-chargesheet/#respond Tue, 09 Jan 2024 08:35:19 +0000 https://tmedia.net.in/?p=69677 టీ మీడియా, జనవరి 9, న్యూఢిల్లీ :]]>

ఈడి చార్జిషీటులో రబ్రీదేవి, మీసాభారతిల పేర్లు

టీ మీడియా, జనవరి 9, న్యూఢిల్లీ : రైల్వే ఉద్యోగాల కోసం భూములకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి ) మంగళవారం మొదటి చార్జిషీటు సమర్పించింది. బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి, ఆమె కుమార్తె ఎంపి మీసాభారతిల పేర్లను చేర్చింది. రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్‌జెడి) అధ్యక్షుడు లాలూ యాదవ్‌ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అమిత్‌ కత్యాల్‌ సహా మరికొందరు, కంపెనీల పేర్లను చేర్చినట్లు పేర్కొన్నారు.

Also Read : ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా డ్రామాలెందుకు.?

ఢిల్లీలోని ప్రత్యేక అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కోర్టులో చార్జీషీటును అప్పీలు చేశామని, ఈ కేసును జనవరి 16న విచారించాలని కోర్టు జాబితా చేసిందని వెల్లడించాయి. కాగా, అమిత్‌ కత్యాల్‌ను గతేడాది నవంబర్‌లో ఈడి అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో లాలూ యాదవ్‌, బీహార్‌ డిప్యూటీ ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌లకు కూడా సమన్లు జారీ చేసింది.

 

]]>
https://tmedia.net.in/rabridevi-in-the-ed-chargesheet/feed/ 0
ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా డ్రామాలెందుకు.? https://tmedia.net.in/politics-68/ https://tmedia.net.in/politics-68/#respond Tue, 09 Jan 2024 08:30:17 +0000 https://tmedia.net.in/?p=69674 టీ మీడియా, జనవరి 9, రాజన్న సిరిసిల్ల :]]>

ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా డ్రామాలెందుకు.?

– ఎంపీ బండి సంజయ్‌

టీ మీడియా, జనవరి 9, రాజన్న సిరిసిల్ల : అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ, కంప్యూటరీకరణ, క్షేత్రస్థాయి పరిశీలన పేరుతో కాలయాపన చేస్తోందని ఎంపీ బండి సంజయ్ కుమార్ విమర్శించారు. షెడ్యూల్ ప్రకారం చూస్తే వచ్చే మార్చి, ఏప్రిల్ లో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. అంతకంటే ముందే ఫిబ్రవరిలోనే ఎన్నికల కోడ్ వచ్చే అవకాశముంది. ఈ విషయం తెలిసి కూడా దరఖాస్తుల కంప్యూటరీకరణ, క్షేత్రస్థాయి పరిశీలన పేరుతో ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా కాలయాపన చేయడమంటే డ్రామాలాడటమేనని పేర్కొన్నారు.

Also Read : 4 ఏళ్ల కొడుకును చంపిన స్టార్ట‌ప్ సీఈవో

వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని వెంకటంపల్లి గ్రామానికి వచ్చిన బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఆరు గ్యారంటీల పేరుతో కాలయాపన చేస్తూ డ్రామాలు చేస్తే ప్రజలు హర్షించరనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.

]]>
https://tmedia.net.in/politics-68/feed/ 0
4 ఏళ్ల కొడుకును చంపిన స్టార్ట‌ప్ సీఈవో https://tmedia.net.in/startup-ceo-who-killed-his-4-year-old-son/ https://tmedia.net.in/startup-ceo-who-killed-his-4-year-old-son/#respond Tue, 09 Jan 2024 08:26:25 +0000 https://tmedia.net.in/?p=69671 టీ మీడియా, జనవరి 9, ప‌నాజీ:]]>

4 ఏళ్ల కొడుకును చంపిన స్టార్ట‌ప్ సీఈవో

టీ మీడియా, జనవరి 9, ప‌నాజీ: ఓ మహిళా వ్యాపారవేత్త తన నాలుగేళ్ల కుమారుడిని అతి దారుణంగా హత్య చేసింది. ఎవరికీ అనుమానం రాకుండా ఆ చిన్నారి మృతదేహాన్ని బ్యాగులో దాచిపెట్టి.. గోవా నుంచి కర్ణాటక వరకు ట్యాక్సీలో ప్రయాణించింది. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఆమెను అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన సుచనా సేత్‌ ఓ స్టార్టప్‌ని స్థాపించి, సీఈవో గా వ్యవహరిస్తోంది. గత శనివారం ఆమె తన నాలుగేళ్ల కుమారుడిని తీసుకుని ఉత్తర గోవాలోని ఒక హోటల్‌కు వెళ్లింది. సోమవారం ఉదయం అక్కడ గదిని ఖాళీ చేసి ట్యాక్సీలో కర్ణాటకకు బయల్దేరింది. ఆ గదిని శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బంది.. అక్కడ రక్తపు మరకలను గుర్తించారు. హోటల్‌ యాజమాన్యం ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. హోటల్‌లో దిగినప్పుడు కుమారుడితో కలిసి కన్పించిన సుచనా.. వెళ్లేటప్పుడు మాత్రం ఒంటరిగా కన్పించడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే ఆమె వెళ్లిన ట్యాక్సీ డ్రైవర్‌కు పోలీసులు ఫోన్‌ చేసి సుచనాతో మాట్లాడారు. అయితే, తన కుమారుడిని ఫ్రెండ్‌ ఇంటి వద్ద వదిలేసినట్లు ఆమె చెప్పింది.

Also Read : ఓటర్ల జాబితాలో ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేశాం

సుచనా ఇచ్చిన ఫ్రెండ్‌ అడ్రస్‌ నకిలీదని తేలడంతో పోలీసుల అనుమానం బలపడింది. వెంటనే కర్ణాటక పోలీసులకు సమాచారమిచ్చారు. అదే సమయంలో, ట్యాక్సీ డ్రైవర్‌ను సంప్రదించి అనుమానం రాకుండా ఆమెను సమీపంలోని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లాలని సూచించారు. చివరకు కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె బ్యాగులో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. సుచనాను అరెస్టు చేశారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. దీనిపై దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

 

]]>
https://tmedia.net.in/startup-ceo-who-killed-his-4-year-old-son/feed/ 0
ఓటర్ల జాబితాలో ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేశాం https://tmedia.net.in/e-complained-about-the-deletion-of-votes/ https://tmedia.net.in/e-complained-about-the-deletion-of-votes/#respond Tue, 09 Jan 2024 08:20:38 +0000 https://tmedia.net.in/?p=69668 టీ మీడియా, జనవరి 9, విజయవాడ:]]>

ఓటర్ల జాబితాలో ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేశాం

– చంద్రబాబు, పవన్‌

టీ మీడియా, జనవరి 9, విజయవాడ: కేంద్ర ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ నేతృత్వంలోని ఎన్నికల సంఘం ప్రతినిధులతో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్‌ పవన్‌ కళ్యాణ్‌లు, వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి విజయవాడలో భేటీ అయ్యారు. వీరితో పాటు బిజెపి, సీపీఎం, బీఎస్పీ, ఆప్‌ నేతలు హాజరయ్యారు. సీఈసీ రాజీవ్‌కుమార్‌ను కలిసి రాష్ట్రంలో ఓటరు జాబితాలో జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదు చేశారు. అనంతరం చంద్రబాబాబు, పవన్‌ కళ్యాణ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల అధికారులను కలిసి రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఏపీలో ఎన్నికలపై ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా చర్యలు చేపట్టాలని కోరినట్లు తెలిపారు. తెలంగాణలో సజావుగా ఎన్నికలు సాగాయి. ఇక్కడ కూడా అలాగే నిర్వహించేలా చూడాలన్నారు. ఆరు వేల నుంచి ఏడు వేల ఓట్లు తొలగించినట్లు ఫిర్యాదు చేశామన్నారు. దొంగ ఓట్లపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రశ్నిస్తే బైండోవర్‌ కేసులతో ప్రతి పక్షాలను వేదిస్తున్నారని తెలిపారు. సచివాలయ సిబ్బందిని ఎన్నికల డ్యూటీకి దూరంగా ఉంచాలని కోరామన్నారు. తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.

Also Read : ఇండోనేషియా దీవుల్లో భారీ భూకంపం.. 6.7 తీవ్రత

తమ కార్యకర్తలను పనిచేసుకోనివ్వడం లేదని ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారికి ఓటువేసే అవకాశం కల్పించాలని కోరినట్లు తెలిపారు.జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ.. ఏపీలో ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీలో అధికార దుర్వినియోగం జరుగుతోందన్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూస్తామని ఎన్నికల సంఘం హామీ ఇచ్చినట్లు తెలిపారు. వాలంటీర్‌ వ్యవస్థ రాజ్యంగ వ్యతిరేకం అన్నారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు చర్యలు చేపట్లాలన్నారు. ఏపీలో దొంగ ఓట్లపై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు.

]]>
https://tmedia.net.in/e-complained-about-the-deletion-of-votes/feed/ 0
ఇండోనేషియా దీవుల్లో భారీ భూకంపం.. 6.7 తీవ్రత https://tmedia.net.in/huge-earthquake/ https://tmedia.net.in/huge-earthquake/#respond Tue, 09 Jan 2024 08:14:54 +0000 https://tmedia.net.in/?p=69664 టీ మీడియా, జనవరి 9, జకార్త :]]>

ఇండోనేషియా దీవుల్లో భారీ భూకంపం.. 6.7 తీవ్రత

టీ మీడియా, జనవరి 9, జకార్త : ఇండోనేషియాలోని తలాడ్ దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున 2.18 గంటలకు తలాడ్‌ దీవుల్లో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 6.7గా నమోదయింది. భూ అంతర్భాగంలో 80 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటుచేసుకున్నాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. ఫిలిప్పీన్స్‌ తీరంలోని పసిఫిక్‌ మహాసముద్రంలో భూమి కంపించిందని అధికారులు తెలిపారు. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని పేర్కొన్నారు. కొత్త సంవత్సరం రోజున జపాన్‌లో 7.6 తీవ్రతతో భారీ భూకంపం వచ్చిన విషయం తెలిసింది. భూకంపం ధాటికి ఇప్పటివరకు 100 మందికిపై మరణించారు. మరో 200కుపైగా మంది ఆచూకీ లభించలేదు.

Also Read : సమస్యలను వెంటనే పరిష్కరించాలి

]]>
https://tmedia.net.in/huge-earthquake/feed/ 0