ప‌శువుల స్మ‌గ్లింగ్ కేసు

టీఎంసీ సీనియ‌ర్ నేత అరెస్ట్‌

1
TMedia (Telugu News) :

ప‌శువుల స్మ‌గ్లింగ్ కేసు

-టీఎంసీ సీనియ‌ర్ నేత అరెస్ట్‌

టీ మీడియా, ఆగష్టు 11, కోల్‌క‌తా : 2020 కోల్‌క‌తా ప‌శువుల స్మ‌గ్లింగ్ కేసులో ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీకి స‌న్నిహితుడిగా పేరొందిన అనుబ్ర‌త మొండ‌ల్‌ను సీబీఐ గురువారం అరెస్ట్ చేసింది. విచార‌ణకు హాజ‌రుకావాల‌ని మొండ‌ల్‌కు ప‌దిసార్లు సీబీఐ స‌మ‌న్లు జారీ చేయ‌గా అనారోగ్య కార‌ణాలు చూపుతూ వ్య‌క్తిగ‌తంగా హాజ‌రు కాలేదు. ప‌శువుల స్మ‌గ్లింగ్ కేసుకు సంబంధించి గ‌తంలో రెండు సార్లు సీబీఐ ఆయ‌న‌ను ప్ర‌శ్నించింది. బీర్భం జిల్లా టీఎంసీ అధ్య‌క్షుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న మొండ‌ల్(61) బెంగాల్ సీఎం మ‌మ‌తా బెనర్జీకి అత్యంత స‌న్నిహితుడిగా పేరొందారు. బీర్భంలో గ‌ట్టిప‌ట్టున్న మొండ‌ల్ ఆ ప్రాంతంలో టీఎంసీ నిల‌దొక్కుకునేందుకు మొండ‌ల్ కృష్టి చేశారు. ప్ర‌స్తుతం బీర్భం జిల్లాలో 11 సీట్ల‌కు గాను 10 స్దానాల‌ను తృణ‌మూల్ కాంగ్ర‌రెస్ గెలుచుకుంది.

 

Also Read : పోలీస్ స్టేషన్ అవరణంలో చెట్లు నాటిన ఎస్సై

 

దీదీకి అత్యంత స‌న్నిహితుడిగా పేరొందిన మొండ‌ల్‌కు టీఎంసీ జాతీయ వ‌ర్కింగ్ క‌మిటీలో చోటు ద‌క్కింది. తృణమూల్ కాంగ్రెస్ విస్త‌ర‌ణ ప్ర‌ణాళిక‌ల‌పై మొండ‌ల్ క‌స‌ర‌త్తు సాగించారు. గ‌తంలోనూ పోలీసుల‌పై బాంబులు విస‌రాలంటూ టీఎంసీ కార్య‌క‌ర్త‌ల‌ను ప్రోత్స‌హించ‌డంతో పాటు ప‌లుమార్లు వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. మూడు ద‌శాబ్ధాల‌కు పైగా రాజ‌కీయాల్లో ఉన్నా మొండ‌ల్ ఎన్న‌డూ ఏ ఎన్నిక‌ల్లోనూ పోటీ చేయ‌లేదు. గ‌తంలో బెంగాల్‌లో ఎన్నిక‌ల అనంత‌ర హింస‌పై ప్ర‌శ్నించేందుకు మొండ‌ల్‌కు సీబీఐ స‌మ‌న్లు జారీ చేసింది. త‌న‌ను అరెస్ట్ చేయ‌కుండా ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని ఆయ‌న కోల్‌క‌తా హైకోర్టును ఆశ్ర‌యించగా కోర్టు అనుకూలంగా ఉత్త‌ర్వులు ఇచ్చింది. హైపోక్సియాతో బాధ‌ప‌డుతున్న మొండ‌ల్ త‌న‌తో పాటు ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల‌ను వెంట‌తెచ్చుకుంటాడు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube