లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డ్రగ్‌ కంట్రోల్‌ ఏడీ

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డ్రగ్‌ కంట్రోల్‌ ఏడీ

1
TMedia (Telugu News) :

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డ్రగ్‌ కంట్రోల్‌ ఏడీ

టీ మీడియా ,సెప్టెంబర్ 16, తిరుపతి : తిరుపతిలో మరో ప్రభుత్వ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యండెడ్ గా పట్టుబడ్డాడు. మెడికల్‌ ఏజెన్సీ రెన్యూవల్‌ కోసం రూ. 20 వేలు తీసుకుంటుండగా పట్టుకున్నారు. తిరుపతి పట్టణంలోని వేదాద్రి మెడికల్‌ ఏజెన్సీ యజమాని విజయసారథి ఏజెన్సీరెన్యూవల్‌ కోసం దరఖాస్తు సమర్పించుకున్నాడు.

Also Read : బ్రహ్మోత్సవాల్లో వివిధ రాష్ట్రాల కళారూపాల ప్రదర్శన

అయితే తిరుపతి డ్రగ్‌ కంట్రోల్‌ ఏడీ చక్రవర్తి అందుకు రూ. 29 వేలు డిమాండ్‌ చేశాడు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి వ్యూహం ప్రకారం బాధితుడు తిరుపతి ప్రకాశం పార్క్‌ వద్ద ఏడీకి రూ. 20వేలు లంచం ఇస్తుండగా అక్కడే మాటువేసిన అధికారులు ఏడీని రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసిన అధికారులు ఏడీ కార్యాలయంలోనూ సోదాలు నిర్వహించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube