సిసి కెమెరాలను ప్రారంభించిన ఏసిపి

సిసి కెమెరాలను ప్రారంభించిన ఏసిపి

0
TMedia (Telugu News) :

సిసి కెమెరాలను ప్రారంభించిన ఏసిపి
టీ మీడియా,మార్చ్ 31, ముదిగొండ : మండలం పరిధిలోని వెంకటాపురం గ్రామ పంచాయతీ లో గ్రామ పంచాయతీ నిధుల నుండి ఏర్పాటుచేసిన 12 సీసీ కెమెరాలను ఖమ్మం రూరల్ ఏసిపి శ్రీ బసవ రెడ్డి గారు ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శ్రీ కోటి అనంత రాములు గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏసీపీ మాట్లాడుతూ, వెంకటాపురం గ్రామ పంచాయతీ ఖమ్మం టూ కోదాడ ప్రధాన రహదారి వెంట ఉండటం అనేక ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అంతే కాదు గ్రామంలో అనేక సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో వాటన్నింటినీ గుర్తించి ఘర్షణలు గొడవలు నివారించవచ్చని గ్రామమంతా నిఘా నేత్రాలు ఉండటం గ్రామాన్ని ప్రశాంతమైన గ్రామంగా తీర్చి దిద్దేందుకు దోహద పడతాయని ఆయన అన్నారు ఈ సందర్భంగా జూదం గంజాయి లను నివారించాలని ఆయన సూచించారు సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులను ఏసీబీ గారు అభినందించారు ఇంకా ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై శ్రీ తోట నాగరాజు గారు నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీ బంకమల్లయ్య గారు, ఉప సర్పంచ్ శ్రీమతి ఘంట పద్మావతి గారు వార్డు సభ్యులు శ్రీమతి సుతారి పద్మావతి గారు శ్రీమతి బంకా రమణ గారు గ్రామ పెద్దలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Also Read : రాహుల్‌గాంధీతో ముగిసిన రేవంత్‌రెడ్డి బృందం భేటీ

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube