సి.సి రోడ్డు శంకుస్థాపన
-విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల
టీ మీడియా, మే28, మధిర: మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో 50లక్షల రూపాయలు నిధులతో సిసి రోడ్డుకు జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజుతో కలిసి రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన టిఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి చిన్న పల్లె, తండ గ్రామ పంచాయతీల ఏర్పడి అభివృద్ధిలో అభివృద్ధి చెందుతున్న అన్నారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా వారు తెలుగు రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడారు.
Also Read : అన్ని దానాల కంటే అన్నదానం మిన్న
ఈ కార్యక్రమంలో సర్పంచ్ ధీరావత్ లక్ష్మి,ఉప సర్పంచ్ హరికిరణ్, ఎంపీడీవో కుడుముల విజయభాస్కర్ రెడ్డి, ఆర్ఐ రమాదేవి,పంచాయతీ రాజ్ ఏఈ ప్రదీప్,మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తరు నాగేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు రావూరి శ్రీనివాస రావు, కార్యదర్శి బొగ్గులు భాస్కర్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు ఎర్రగుంట రమేష్, కో ఆప్షన్ సభ్యులు కొఠారి రాఘవరావు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు చావా వేణు, నియోజకవర్గ యువజన అధ్యక్షులు కొన నరేందర్ రెడ్డి, అట్లూరి ఉమా మహేశ్వర్ రెడ్డి, కౌన్సిలర్లు యన్నంశెట్టి అప్పారావు, ముత్తరపు ప్యారి, జేవీ రెడ్డి, ఆళ్ల నాని, గద్దల నాని, ఆవుల రామకృష్ణ, గుగిలోతు క్రిష్ణ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube