ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం

ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం

1
TMedia (Telugu News) :

ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం

టీ మీడియా ,మార్చి 15, వేములవాడ : రాజన్న సిరిసిల్ల పౌర సరఫరాలశాఖ మరియు కన్స్యూమర్స్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం సిరిసిల్ల జెడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా సదస్సు నిర్వహించారు. డిఎస్వో సింగిరెడ్డి జితేందర్ రెడ్డి సభకు అధ్యక్షత వహించి మాట్లాడుతూ వినియోగదారుడా నీ హక్కులు తెలుసుకో అనే అంశంపై ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు తెలిపారు. అదనపు కలెక్టర్ ఖిమ్యానాయక్ మాట్లాడుతూ 1986లో వినియోగదారుల హక్కుల చట్టం అమల్లోకి వచ్చిందన్నారు. వినియోగదారుల హక్కులపట్ల అవగాహన కల్పించడం ఈ వేడుకలు ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. వినియోగదారులు వస్తుసేవల విషయంలో ఏదైనా లోపాలు లేదా అన్యాయం జరిగినప్పుడు వినియోగదారుల ఫోరంలలో తగిన న్యాయం పొందవచ్చునని అన్నారు. కావున ప్రతి ఒక్కరూ వినియోగదారుల హక్కులు తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.

Also Read : తిరుమల లోనామ జన్మదిన వేడుకలు

అనంతరం వినియోగదారుల మండలి అధ్యక్షులు హబీబ్ బాషా ను అదనపు కలెక్టర్ ఖిమ్య నాయక్ శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వినియోగదారుల మండలి అధ్యక్షులు హబీబ్ బాషా, సిరిసిల్ల వినియోగదారుల అధ్యక్షులు ఝాన్సీ, వేముల మార్కండేయులు, చీకటి అనిల్ పౌరసరఫరాల శాఖ అధికారులు వహిదు, ప్రవీణ్ , పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube