నేడు రంగనాథస్వామి రథోత్సవం

నేడు రంగనాథస్వామి రథోత్సవం

0
TMedia (Telugu News) :

నేడు రంగనాథస్వామి రథోత్సవం

టీ మీడియా, మార్చి 16, వనపర్తి : అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీరంగనాథుడు వెలిసిన శ్రీరంగం తమిళనాడు రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన ప్రసిద్ధి వైష్ణవ పుణ్యక్షేత్రం దానికి సమానంగా తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలంలో వనపర్తి సంస్థానాధీశుల అయిన శ్రీ రాజ రాజేశ్వర రావు బిహరీ బలవంత బహదూర్ వారి ధర్మపత్ని రాణి శంకరమ్మచే శాలివాహన శకం 1804 చిత్రభాను సంవత్సరం మార్గశిర మాసంలో శ్రీ రంగనాథస్వామి దేవాలయం నిర్మించబడింది. 17వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు రథోత్సవం కార్యక్రమం ఉంటుంది. ఆలయం యొక్క చరిత్రను పరిశీలిస్తే శ్రీరంగం వెళ్లి ఆరంగాన్ని దర్శించే శక్తిలేని భక్తులు అపార శ్రీరంగంగా శ్రీరంగాపురం రంగాన్ని దర్శించి తరించవచ్చు అని ఆస్తికులు విశ్వాసం వివిధ సంప్రదాయాలతో ద్వారపాలక శిల్పాలతో ఆకాశాన్నంటే అంతస్తులతో సందర్శకులను ఆశ్చర్యచకితులను చేసే విధంగా భక్తులకు స్వాగతం ఇస్తుంది. శ్రీ రంగనాథస్వామి ఆలయ ప్రధాన ద్వారం ఆలయంలో శ్రీ లక్ష్మీ దేవి అమ్మవారు భక్తుల మనసులను ఆధ్యాత్మిక భావనతో నింపే వేస్తారు.

Also Read : యాభై మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు గల్లంతేనా..?

ఒకవైపు యోగశాల పంచకుండా మనతో నిత్య ఆవానం అగ్నిదేవుని ఆవాహనం అష్టదిక్పాలకులు బలిహరణం మరోవైపు గరుడ శేషా గజ అశ్వ వాహనములు ఆకాశాన్నంటే అనేక అంతస్తులతో శాస్త్ర సమేతంగా తయారు చేసిన రథ బ్రహ్మోత్సవాలలో శ్రీవారి సేవలతో లక్షలాది ప్రజలకు కన్నుల పండగ దర్శనమిస్తుంది. అలంకార మండపం, కోరాయి మండపం, సభ మండపం, కళ్యాణమండపం, ఆరామ విరామ సొరంగ మందిరాలు శ్రీవారి వైభవానికి చిహ్నాలు. ఆలయం పక్కనే ఆనాటి ప్రభువులు నిర్మించిన శ్రీరంగసముద్రం అనే సువిశాలమైన చెరువు శ్రీస్వామివారి సేవ కైంకర్యానికి ఉపయోగపడటమే కాక కొన్ని వందల ఎకరాల పొలాలు పుష్కలంగా నీటిని ప్రసాదిస్తుంది. అంగరంగ వైభవంగా జరుపబడే శ్రీరంగనాధుని ఉత్సవాలకు తరలి వచ్చిన అశేష జనవాహినిని దృష్టిలో ఉంచుకున్న నాటి వనపర్తి సంస్థాన ప్రభువులు యాత్రికుల సౌకర్యార్థం సత్రాలు నిర్మించడమే కాక తిరునాళ్ళకు వచ్చిన ప్రజల కోసం వినోద విన్యాసాలు, సర్కస్ లో సాంస్కృతిక కార్యక్రమాలు, పశువుల సంత తదితర అనేక వ్యాపారాలు జనరంజకంగా నిర్వహించి ఈ యాత్ర స్థలంలో ప్రజలకు ఏ లోటు లేకుండా చూసుకునేవారు. ఇటువంటి యాత్ర స్థలాన్ని మళ్లీమళ్లీ దర్శించుకోవాలని కోరికను ప్రజలకు కలిగించేవారు. ఈ యాత్రాస్థలంకి గల పూర్వ వైభవాన్ని కాపాడడానికి శ్రీవారి బ్రహ్మోత్సవాలను తరలి వచ్చే ప్రజలకు యధావిధిగా వైద్యసేవ, వినోద విన్యాసాలు, పశువుల సంతలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజలకు కావలసిన సదుపాయాలను కల్పించి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించాలని శ్రీరంగాపురం గ్రామ ప్రజలు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు గట్టిగా సంకల్పించారు.

Also Read : ప‌ది ప‌రీక్ష‌ల షెడ్యూల్ మార్పు

కాబట్టి ఏడవ నెంబర్ జాతీయ రహదారికి సమీపంలో చక్కటి రోడ్డు సౌకర్యంతో ప్రకృతిని ఎంతో పవిత్రంగా అలరారుతున్న శ్రీరంగాపురం గ్రామానికి విచ్చేసి కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీరంగనాథస్వామి వారిని దర్శించుకుని ఇహపర సౌభాగ్యంములను పొందవలసిందిగా కోరుతున్నారు. తుంగభద్ర నదీ తీరంలోని అలంపూర్ కృష్ణా నదితీరంలోని బీచ్పల్లి జటప్రోలు క్షేత్రాలు ఈ గ్రామానికి సమీపంలో ప్రాంతంలో నెలకొని ఉన్నాయి. రంగసముద్రం పేరుగల తటకం ఒడ్డుపై గరుడ్రాది మీద నిర్మితమైన శ్రీరంగాపురక్షేత్రం అపార శ్రీరంగంగా ప్రసిద్ధికెక్కింది. సుమారు మూడు వందల నలభై సంవత్సరాల క్రితం సూగురు సంస్థాన ప్రభువు అష్టభాషా బహారీ గోపాలరావు(కీ.శ.1679) ఈ కాలంలో ఈ ఆలయ నిర్మాణం ప్రారంభమైనది. ప్రతి ఏటా పాల్గుణ శు” పూర్ణమ మొదలుకొని ఉగాది పండుగ వరకు 15 రోజుల పాటు ఇక్కడ ఘనంగా జాతర జరుగుతుంది. భక్తుల పాలిట కల్పతరువుగా విరాజిల్లుతున్న శ్రీరంగనాధుని కరుణాకటాక్ష వీక్షణమూలకు పాత్రమైన శ్రీరంగాపురం గొప్ప పర్యాటక కేంద్రంగా రూపొందనున్నది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube