గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ పాల అభిషేకాలు

గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ పాల అభిషేకాలు

1
TMedia (Telugu News) :

గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ పాల అభిషేకాలు

టి మీడియా, మార్చి 17 వెంకటాపురం:ములుగు జిల్లా వెంకటాపురం మండల గ్రామీణ మహిళల సర్వోన్నత అభివృద్ధి కోసం సాధికారత కోసంఆర్థిక స్వావలంబన కోసంగత 20 సంవత్సరాల నుండి కృషి చేస్తున్న సెర్ప్ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పే స్కేల్ వర్తింప చేస్తామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రకటించిన సందర్భంగా ఈ శాఖ ఉద్యోగులు మంగళవారం వెంకటాపురం మండల సమాఖ్య ఆఫీస్ ఆవరణలో లో సిబ్బంది పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి కి పాలాభిషేకం చేస్తూ పంచాయతీ రాజ్ శాఖా మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు , ఆర్థిక శాఖా మంత్రి వర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు కి కృతజ్ఞతా గా ఉంటామని ఈ సందర్భంగా జెఎసీ నాయకులు , కె శంకరమ్మ , ఎ పియం లక్ష్మిదుర్గ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గుర్తిస్తూ, స్థాయికి తగినట్టుగా రాష్ట్ర ప్రభుత్వ స్థాయి వేతనాల మంజూరు కి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అసెంబ్లీ వేదికగా మాట్లాడడం మహిళల కోసం గ్రామీణ అభివృద్ధి కోసం, మహిళా సాధికారత పట్ల ముఖ్యమంత్రి ఉన్న నిబద్ధత స్పష్టమైందని తెలియజేశారు.

Also Read : వైభవంగా పదహారు రోజుల పండుగ

ఆ దిశలో సిబ్బంది మరిన్ని విజయాలు సాధించి రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. సెర్ప్ సిబ్బంది యోగక్షేమాల పట్ల. పెద్దన్న పాత్ర పోషిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తెలియజేస్తూ సిబ్బందికి మాట ఇచ్చిన విధంగానే ఈ మహిళ ఉత్సవాల లోనే మీకు తీపి కబురు తీసుకొస్తామని ఈ అసెంబ్లీ వేదిక సెర్ప్ ఉద్యోగులకు ఓ మరుపురాని ఘట్టం గా మిగిలిపోతుందని తెలియజేసిన మంత్రి మాటలు నిజం కావడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. పే స్కేల్ వర్తింప చేయడం వల్ల సిబ్బంది జీతభత్యాలు డబుల్ పెరిగే అవకాశం ఉందని మరింత బాధ్యతగా పనిచేస్తూ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎపియం లక్ష్మిదుర్గ, సిసిలు జి వి నర్సయ్య, జె సిహెచ్ సమ్మయ్య , కుడీకాలు వెంకటలక్ష్మి , కోటిపల్లి వెంకటలక్ష్మి, అకౌంటెంట్ విజయ స్వప్న , సంఘ సభ్యులు , వి ఓ ఏ లు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube