వార్షికోత్సవ వేడుకల్లో పొంగులేటి

వార్షికోత్సవ వేడుకల్లో పొంగులేటి

1
TMedia (Telugu News) :

వార్షికోత్సవ వేడుకల్లో పొంగులేటి
టీ మీడియా,మార్చి 20,నేలకొండపల్లి: అన్నం పరబ్రహ్మ స్వరూపమని… అన్ని దానాల్లో కెల్లా అన్నదానం గొప్పదని తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. శనివారం నేలకొండపల్లి మండలం బొదుల బండ గ్రామంలో కంఠ మహేశ్వరస్వామి వారి ద్వితీయ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన కళ్యాణ మఘోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమన్ని పొంగులేటి ప్రారంభించి ప్రసంగించారు. అనంతరం ఇటీవల మరణించిన పగిడికత్తుల రామకృష్ణ, గుండెపోగు నాగమణిల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ఆర్ధిక సహాయంను అందజేశారు. పొంగులేటి వెంట బొదులబండ సర్పంచ్ అనగాని నర్సింహారావు, ఎంపీటీసీ కట్టెకోల సుధాకర్, అనంత కాశయ్య, కట్టెకోల నాగేశ్వరరావు, కట్టెకోల నాగర్జున రావు, కిరణ్, సైదిరెడ్డి, కొడాలి గోవిందరావు, ఈదయ్య, వంగూరి ఆనందరావు, పొట్టపింజర నాగులు, జానారెడ్డి, శ్రీనాథ్, భానుప్రసాద్, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, జుజ్జూరి రామిరెడ్డి, వెంకటరెడ్డి, తిరుమలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Also Read : అంతర్జాతీయ కంపెనీల గమ్యస్థానం తెలంగాణ

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube