ప్రపంచ అటవీ దినోత్సవ వేడుకలు

ప్రపంచ అటవీ దినోత్సవ వేడుకలు

1
TMedia (Telugu News) :

ప్రపంచ అటవీ దినోత్సవ వేడుకలు

టీ మిడియా, మార్చి 22, వెంకటాపురం:ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ గోపాలరావు నేతృత్వంలో వెంకటాపురం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వంశీకృష్ణ అధ్యక్షతన ప్రపంచ అటవీ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎఫ్ డి ఓ మాట్లాడుతూ అందరికి అటవీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి అటవీ సిబ్బంది అందరూ కలిసి బైక్ ర్యాలీని నిర్వహించారు జాతీయ సంపద అయిన అడవుల రక్షణ అభివృద్ధి కి ప్రతి పౌరుడు కృషి చేయాలనీ వెంకటాపురం ఎఫ్ డి వో తెలియజేశారు. అడవిని అడవి జంతువులను వారసత్వ సంపదగా భావించి ముందుతరాలకు అందించాలని ఆయన కోరారు . మన దేశంలో అడవులు అడవి ఉత్పత్తి సేకరణ ద్వారా అనేక లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. అడవుల నుంచి కేవలం కలప మాత్రమే కాకుండా పలు పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకులు లభిస్తున్నాయి. అడవులు నేల సారాన్ని కాపాడుతూతూ వాతావరణంలో ఉష్ణోగ్రతను సమతుల్య పరుస్తాయి కార్బన్ వాయువును పీల్చుకొవడం లో అడవులు కీలకపాత్ర పోషిస్తున్నాయి.

Also Read : దర్శనం మొగిలయ్య పద్మశ్రీ అవార్డు

ప్రపంచ దేశాలు అడవుల ప్రాముఖ్యతను గుర్తించి అనివార్యం అనివార్యం గా మారింది మొక్కల పెంపకం మీద అనేక ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లో ఆకురాల్చే అడవులు కొండ చరియ ప్రాంతాలు విస్తరించి ఉన్నాయి ప్రతి సంవత్సరం మార్చి 21 తేదీన ప్రపంచ అటవీ దినోత్సవం జరుపుకుంటున్నమని 1990 సంవత్సరంలో ఒక దేశనికి అడవి ఉంటే ఉంటే మరొక దేశంలో కూడా లాభ పడుతుందని ఉద్దేశంతో తో కెనడా ప్రభుత్వం కూడా భారతదేశానికి నిధులు ఇవ్వడం జరిగింది. ప్రతి పౌరుడు అడవిని పెంచడానికి దోహదపడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెరాస సీనియర్ నాయకులు అచ్చ నాగేశ్వరరావు పాల్గొని అందరికీ ఆటవీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.కార్యక్రమంలో వాజేడు, దూలా పురం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ , డిప్యూటీ రేంజ్ ఆఫీసర్స్ , ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ , ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఎగ్జిక్యూటివ్, మినిస్టీరియల్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube