అంతర్జాతీయ జల దినోత్సవం

అంతర్జాతీయ జల దినోత్సవం

1
TMedia (Telugu News) :

అంతర్జాతీయ జల దినోత్సవం
టీ మీడియా,మార్చ్ 22, చింతూరు :తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండల గవర్నమెంట్ డిగ్రీ కళాశాల నందు అంతర్జాతీయ జల దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఐటీసీ బంగారు భవిష్యత్తు సంస్థ వారు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ… భూగర్భ జలాలను పెంపొందించు కోవాలనే లక్ష్యం తో ఈ రోజున అంతర్జాతీయ జల దినోత్సవం జరుపుకుంటున్నాం అని ఐటీసీ ఎం స్ కె మేనేజర్ హేమంత్ గారు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో .రాజు యొక్క ఉపయోగలు విద్యార్థులకు వివరించడం జరిగింది. అలాగే గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఇంచార్జ్ జి.వెంకట్రావ్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది అనంతరం అంతర్జాతీయ జల దినోత్సవం ను పురస్కరించుకుని విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సొసైటీ పర్ సంపూర్ణ గ్రామ స్వరాజ్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గణేష్ గారు, కమ్యూనిటి ఆర్గనైజర్ అశోక్ మరియు కళాశాల అధ్యాపకులు ,విద్యార్థులు పాల్గొన్నారు.

Also Read : అరటి రైతులను ఆదుకోండి :ఎమ్మెల్యే

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube