కొలువుల జాతర పై పార్టీ శ్రేణుల సంబరాలు

కొలువుల జాతర పై పార్టీ శ్రేణుల సంబరాలు

1
TMedia (Telugu News) :

కొలువుల జాతర పై పార్టీ శ్రేణుల సంబరాలు
టీ మీడియా మార్చి 10 అశ్వారావుపేట: ఉద్యోగ నోటిఫికేషన్లు ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ స్పష్టమైన ప్రకటన చేయడంతో నియోజకవర్గ కేంద్రంలో పండుగ వాతావరణం చోటు చేసుకుంది. పార్టీ కార్యకర్తలు నాయకులు స్థానిక రింగ్ రోడ్డు లో తెలంగాణ తల్లి విగ్రహం నందు,బీఈడీ కళాశాల యందు,ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ కళాశాలలో కాంట్రాక్టు ఉద్యోగుల తో కలసి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెరాస పట్టణ అధ్యక్షుడు సత్య వరపు సంపూర్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో 91,142 పోస్టుల భర్తీ కి అందులోనూ 11,103 కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తూనిర్ణయం పట్ల తెలంగాణ నిరుద్యోగులకు ఊరట నిచ్చిందని అని,నిరుద్యోగులకు కూడా ఇంత పెద్ద ఎత్తున నోటిఫికేషన్ ఇవ్వడం కూడా రికార్డ్ అని ఆ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు ముబారక్ బాబా, వెంకన్న బాబు,యువజన నాయకులు మోటూరి మోహన్,సోమని శ్రీను,నాని తదితరులు పాల్గొన్నారు.

Also Read : బాణాసంచా పేల్చి, స్వీట్లు పంపిణీ

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube