జర్నలిస్ట్ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కి సన్మానం

జర్నలిస్ట్ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కి సన్మానం

1
TMedia (Telugu News) :

జర్నలిస్ట్ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కి సన్మానం
టీ మీడియా , మార్చి26,పెద్దపల్లి బ్యూరో:రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం పెద్దపెల్లి జిల్లా సహాయ కార్యదర్శి గా ఏకగ్రీవంగా ఎన్నికైన కాల్వ శ్రీరాంపూర్ మండలం ఆంధ్రప్రభ రిపోర్టర్ బాలే శివప్రసాద్ ను శనివారం ఎంపీపీ నూనెటి సంపత్, జెడ్పిటిసి వంగల తిరుపతిరెడ్డి, సింగిల్విండో చైర్మన్ గజవల్లి పురుషోత్తం లు సన్మానించారు. ఈ సందర్భంగా శివప్రసాద్ ను శాలువాతో సన్మానించి ఆర్థిక శుభాకాంక్షలు తెలిపి స్వీట్లు తినిపించారు. పత్రికా రంగంలో ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తూ, ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలుస్తూ ముందు ముందు మరిన్ని పదవులు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో మాజీ చైర్మన్ కొట్టే సమ్మయ్య, సర్పంచ్ డోoకేన విజయ మొగిలి, ఎంపీటీసీ కొల్లూరి రమాదేవి రాజమల్లు, సింగిల్విండో అబ్జర్వర్ శివ ప్రసాద్, సీఈవో విజేందర్, డైరెక్టర్లు ఉన్నారు.

Also Read : వ్యక్తుల కంటే పార్టీకే ప్రాముఖ్యతను ఇవ్వండి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube