తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

1
TMedia (Telugu News) :

తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

టీ మీడియా, మార్చి30, రామకృష్ణాపూర్:తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళ వారం రామకృష్ణాపూర్ లో ఘనంగా జరుపుకున్నారు.సూపర్ బజార్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సీనియర్ పార్టీ కార్యకర్తలను శాలువాలతో సన్మానించారు. పార్లమెంట్ అధ్యక్షుడు సంజయ్ కుమార్ మాట్లాడుతూ ”ప్రజలే దేవుళ్లు-సమాజమే దేవాలయం” అని నమ్మిన ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగించాలని అన్నారు. నియోజకవర్గంలో పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తల గుండెలో ధైర్యాన్ని నూతన ఉత్సాహాన్ని నింపారు.కార్మికులకు, రైతులకు మహిళలకు, విద్యార్థులకు, పేద బడుగు బలహీన వర్గాల ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న మహానీయుడు అని అన్నారు. రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చి నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచిన మహనీయుడు అన్న ఎన్టీఆర్ అని మోనుయాడారు. సింగరేణి కార్మిక ప్రాంతంలో 35 వేల పందికి ఒకేసారి ఎట్లాంటి దళారీ వ్యవస్థకు అవకాశం ఇవ్వకుండా పరుగుపందెం ద్వారా ఉద్యోగ కల్పించారని,తెలుగుదేశం పార్టీని ప్రజలందరూ ఆదరించి పునర్వైభవం తీసుకురావాలని కోరారు.అనంతరం రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గట్టయ్య ను పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంజయ్ పూల మాలలతో,శాలువా కప్పి సన్మానించారు.ఈ కార్యక్రమంలో రామకృష్ణాపూర్ మందమర్రి జిల్లా కార్యకర్తలువై ఉమామహేశ్వరరావు,ఎండి షరీపా , అనంతలక్ష్మి , రజియా, సమ్మక్క, జక్కుల సమ్మయ్య, బై రాజు శ్రీనివాస్, గోలేటి సురేందర్, సరేష్, జేలీల్,శంకర్,శేఖర్ ,ఇందరం రాములు , వాసాల సాగర్, రంగనాథ్లు పాల్గొన్నారు.

Also Read : సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube