కళ్యాణోత్సవాల్లో పాల్గొనడం పూర్వజన్మ సుకృతం

ఎర్రబెల్లి

1
TMedia (Telugu News) :

కళ్యాణోత్సవాల్లో పాల్గొనడం పూర్వజన్మ సుకృతం: ఎర్రబెల్లి
టీ మీడియా , ఎప్రియల్ 10,జనగామ: పాలకుర్తి నియోజకవర్గంలో రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సుడిగాలి పర్యటన చేశారు.శ్రీ రామ నవమి సందర్భంగా నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న పలు ఆలయాలు వారి సతీమణి ఉషా దయాకర్ రావు తో కలిసి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, సీతారాముల జీవితం ప్రపంచానికి ఆదర్శం.

Also Read : ముత్యాల తలంబ్రాల వితరణ

వారి కళ్యాణోత్సవాలలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతమని అన్నారు. సీఎం కెసిఆర్ అధ్వర్యంలో నే దేవాలయాలకు పూర్వ వైభవం లభిస్తున్నది అన్నారు. పురాతన దేవాలయాల పునరుద్ధరణ చేస్తున్నారని చెప్పారు. నియోజకవర్గంలోని దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. మరిన్ని దేవాలయాలను అభివృద్ధి పరచడానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube