ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

1
TMedia (Telugu News) :

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

టీ మీడియా, మార్చి11, మధిర: మండలం లోని దెందుకూరు మండల పరిషత్ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు చక్కని అలంకరణతో ముస్తాబై వచ్చి విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠ్యాంశాలను తోటి స్నేహితులకు అర్ధమయ్యే రీతిలో పాఠాలను బోధించారు.అనంతరం జరిగిన సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ. వినోద్ రావు మాట్లాడుతూ….. నిత్యజీవితంలో ఉపాధ్యాయులు విద్యార్థులకు ఏ విధంగా పాఠాలను భోదిస్తారో ఈ స్వయం పాలనా దినోత్సవం వల్ల విద్యార్థులకు తెలుస్తుందని, ఉపాధ్యాయుల పట్ల,ఉపాధ్యాయ వృత్తి పట్ల గౌరవ భావం ఏర్పడుతుందని అన్నారు. అనంతరం మంచిగా బోధించిన వారికి బహుమతులను అందజేశారు. ఈ సమావేశంలో పాఠశాల ఉపాధ్యాయులు జి.కిరణ్ కుమార్, విద్యా వాలంటీర్లు పి.లావణ్య, పి.ధర్మ తదితరులు పాల్గొన్నారు.

Also Read : పంటలను కోతుల నుండి రక్షించుట కు విన్నుత ప్రదర్శనలు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube