స్వాతంత్ర్య భారత వజ్రోత్సవ దినోత్సవ వేడుకలు

స్వాతంత్ర్య భారత వజ్రోత్సవ దినోత్సవ వేడుకలు

1
TMedia (Telugu News) :

స్వాతంత్ర్య భారత వజ్రోత్సవ దినోత్సవ వేడుకలు

టీ మీడియా, ఆగస్ట్ 10,జన్నారం: భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలలో భాగంగా బుధవారం రోజు నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో జన్నారం అటవీశాఖ ఎఫ్.డి.ఓ మాధవరావు ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఈసీసీ సెంటర్లో, పోనకల్ సర్పంచ్ జక్కు భూమేష్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఆవరణలో జన్నారం సర్పంచ్ గంగాధర్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఆవరణలో 75 మొక్కలు నాటారు.మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో మొక్కలు నాటి వనమహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

Also Read : గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం స్వాతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తుందని అన్నారు. ఈ మొక్కలు నాటడం అనేది నిరంతర ప్రక్రియ అని,తెలంగాణను హరిత తెలంగాణగా తీర్చిదిద్దడానికి సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని, హరిత తెలంగాణ లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి మాదాడి సరోజన రవీందర్ రావు, ఎంపీటీసీ రియజోద్దీన్,ఎఫ్.ఆర్.ఓ లు హఫీజోద్దీన్, రత్నాకర్ రావు,మండల పశు వైద్యాధికారి శ్రీకాంత్,అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube