ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

0
TMedia (Telugu News) :

ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

 

టీ మీడియా, సెప్టెంబర్ 27, జయశంకర్ భూపాలపల్లిజిల్లా: భారత స్వాతంత్ర సమరయోధుడు తెలంగాణ ఉద్యమ ఆది గురువ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 107 వ జయంతిని పురస్కరించుకొని జయశంకర్ భూపాలపల్లి జిల్లా నోడల్ అధికారి మరియు తాడిచర్ల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ దేవరాజు సార్ ఆదేశాలతో మండల కేంద్రమైన తాడిచెర్ల జూనియర్ కళాశాలలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి వేడుకలు NSS ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అధ్యాపక బృందం విద్యార్థులతో కలిసి కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల తో నివాళులర్పించడం జరిగింది.

Also Read : కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

అనంతరం జరిగిన కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమంలో మూడు తరాలకు వారధిగా ఉండి తను చివరి వరకు తన 97వ వయసులో కూడా ప్రత్యేక తెలంగాణ కోసం ఎముకలు కొరికే చలిలో హైదరాబాదులో నిరాహార దీక్ష చేయడం జరిగిందని చివరికి తన కోరిక తీరకుండానే మరణించడం జరిగిందని, ఎందరోనాయకులు లక్ష్మణ్ బాపూజీ యొక్క ఆదర్శప్రాయులయ్యారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో NSS ప్రోగ్రాం అధికారి రవీందర్, అధ్యాపకులు నరేందర్, ప్రవీణ్, వెంకట్ రెడ్డి, కరుణాకర్, స్వరూప రాణి, రమేష్, జైపాల్, రవి, ఉమామహేశ్వరి, కళాశాల సిబ్బంది. ఇమ్రాన్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube