విశాఖలో నౌకాదళ ఉత్సవాలు.. దేశ రాజధాని వెలుపల తొలిసారి
విశాఖలో నౌకాదళ ఉత్సవాలు.. దేశ రాజధాని వెలుపల తొలిసారి
విశాఖలో నౌకాదళ ఉత్సవాలు.. దేశ రాజధాని వెలుపల తొలిసారి
టీ మీడియా, డిసెంబర్ 3, న్యూఢిల్లీ : ఏటా దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా జరిగే జాతీయ నౌకాదళ ఉత్సవాలకు ఈసారి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం ఆతిథ్యం ఇస్తున్నది. దీంతో ఢిల్లీలో కాకుండా ఇతర ప్రాంతాల్లో నేవీ డే వేడుకలు జరుగడం ఇదే మొదటిసారి. 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో విజయానికి గుర్తుంగా ఏటా డిసెంబర్ 4 నేవీ డేగా నిర్వహిస్తున్నది. ప్రతి సంవత్సరం న్యూఢిల్లీలో త్రివిధ దళాధిపతి అయిన భారత రాష్ట్రపతి సమక్షంలో వేడులను నిర్వహిస్తారు.
Also Read : పాక్ డ్రోన్‌ను కూల్చివేసిన బీఎస్ఎఫ్ జవాన్లు
అయితే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ‘ఆజాదీ కా అమృత్’ మహోత్సవాలను నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా పాక్‌పై విజయంలో కీలకపాత్ర పోషించిన తూర్పు నావికా దళానికి కేంద్రమైన విశాఖలో ఈ వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఉత్సవాలకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, పలువురు కేంద్ర మంత్రులు, సైనిక ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube