ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

1
TMedia (Telugu News) :

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం
టి మీడియా, మార్చి 11,రేవల్లి :వనపర్తి జిల్లా రేవల్లి మండలం కేశంపేట గ్రామం ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థిని విద్యార్థులు ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకున్నారు అని ప్రధానోపాధ్యాయులు తెలిపారు వివరాలు ఇలా ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేష్ ఆధ్వర్యంలో మొత్తం 23 మంది విద్యార్థులు స్వయం ఉపాద్యాయులు గా పాల్గొన్నారు మండలం విద్యా అధికారిని గా ఎన్ రిషిత 7 వ తరగతి ప్రధానోపాధ్యాయులు గా బి వివేక్ 8 వ తరగతి పాల్గొన్నారు అనంతరం బోధనా పద్ధతులను బట్టి విద్యార్థులకు బహుమతులు అందజేశారు వీటిలో సినియార్స్ లలో ఏకాంబరం 7 వ తరగతి ప్రథమ బహుమతి దివ్య 8 వ తరగతి ద్వితీయ బహుమతి జూనియర్స్ లో అఖిల్ 5 వ తరగతి ప్రథమ బహుమతి మదిహ తబుస్సుం 5 వ తరగతి ద్వితీయ బహుమతులు పొందారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం బాల్ రాజ్ భీముడు శ్రీనివాసాచారి వెంకటేశ్వర్లు సురేష్ రాములు శేఖర్ రావు రజనీబాబు తదితరులు పాల్గొన్నారు.

Also Read : బాధితులకు బాసటగా దిశ ఫౌండేషన్

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube