ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవం

1
TMedia (Telugu News) :

ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవం.
టి మీడియా,మార్చి14, జులూరుపాడు: ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన పార్టీ ఆవిర్భవించి ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుని తొమ్మిదవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా జనసేన తొమ్మిదేళ్ల ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని జూలూరుపాడు మండల కేంద్రంలో సోమవారం మెగా ఫ్యాన్స్ ,జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు .ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు లకావత్ రమేష్ కేక్ కట్ చేసి అందరికీ మిఠాయిలు పంపిణీ చేశారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బాపట్ల మురళి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి జనసేన జిల్లా నాయకులు రమేష్ మాట్లాడుతూ రానున్న కాలంలో లో ఆంధ్ర తోపాటు తెలంగాణలో సైతం జనసేన పార్టీ బలమైన శక్తిగా ఎద కాబోతుందన్నారు. ఆంధ్రాలో రానున్న ఎన్నికలలో జనసేన విజయం సాధించి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు. జనసేన కార్యకర్తలు అందరూ కష్టించి పనిచేసి పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేసే వరకు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మెగా ఫ్యాన్స్ జనసేన నాయకులు పాశం నరేష్ ,రేగిముడి పుల్లారావు, సుమన్ , విజయ్ , వీరు ,గణేష్, సాయి శ్రీనివాస్ , అభిరామ్, శ్యామ్ , సుందర్ , తరుణ్, నరసింహారావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Also Read : సమస్యలపై సిపిఎం సర్వే

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube