ఘనంగా ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు

వైభవంగా ప్రారంభమైన నిమజ్జన శోభాయాత్ర

0
TMedia (Telugu News) :

ఘనంగా ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు

– త్రిశక్తి పీఠ దేవస్థానంలో ఘనంగా దసరా వేడుకలు

–  కాళీమాతగా దుర్గాదేవి దర్శనం

– వైభవంగా ప్రారంభమైన నిమజ్జన శోభాయాత్ర

టీ మీడియా, అక్టోబర్ 6, మల్హర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం వల్లెంకుంట గ్రామంలోని ప్రసిద్ధ జంబూద్వీప శక్తిపీఠపాలిత శ్రీత్రిశక్తి పీఠ దేవస్థానంలో పది రోజులుగా అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా సాగిన శరన్నవరాత్రి వేడుకలు గురువారం ముగిశాయి. బుధవారం దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మవారు రాజరాజేశ్వరి దేవి గా భక్తులకు దర్శనమిచ్చారు. గురువారం దుర్గమ్మ కాళీమాత రూపంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు గడ్డం సతీష్ భవాని స్వామీజీ ఆధ్వర్యంలో కుంకుమ పూజలు, హోమం, విశేష పూజలు నిర్వహించారు. నవరాత్రుల పాటు దుర్గామాతకు, జంబూద్వీప శక్తిపీఠపాలిత శ్రీత్రిశక్తి పీఠ దేవస్థానం అంతరాలయంలోని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Also Read ; జల్లేపల్లి గ్రామంలో విజయ దశమి వేడుకలు

గురువారం దుర్గమ్మ నిమజ్జన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహాముత్తారం మండలం కొర్లకుంట సర్పంచ్ నవీన్, అతని సోదరుడు వినోద్ కుమార్ పాల్గొని నిమజ్జన కార్యక్రమాన్ని పరారంభించారు. దుర్గమ్మ నిమజ్జన వేడుకల సందర్భంగా అమ్మవారి విగ్రహాన్ని అందంగా అలంకరించిన ట్రాక్టర్‌లో ఉంచి డీజే సౌండ్స్ తో, వల్లెంకుంట హనుమాన్ భజన మండలి ఆధ్వర్యంలో కోలాటాలు వేయగా యువకులు నృత్యాలు చేశారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని కోలాటాలు వేసి ఆకట్టుకున్నారు. నిమజ్జన కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఉదయం నుంచే దుర్గామాతకు ఆలయ ప్రధాన అర్చకులు గడ్డం సతీష్ భవాని స్వామీజీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వల్లెంకుంట వీధులన్నీ భక్తి పారవశ్యంలో మునిగిపోయాయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube