రాజోలిలో ఘనంగా జయశంకర్ వర్ధంతి వేడుకలు

జిల్లా నేత జయప్రకాశ్

1
TMedia (Telugu News) :

రాజోలిలో ఘనంగా జయశంకర్ వర్ధంతి వేడుకలు

జిల్లా నేత జయప్రకాశ్
టీ మీడియా,జూన్ 21, జోగులాంబ గద్వాల జిల్లా: అలంపూర్ నియోజక వర్గం రాజోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ జోగుళాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు జయప్రకాశ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అనునిత్యం పరితపించి, అహర్నిశలు శ్రమించి కృషి చేసిన వ్యక్తి అని ఆయన కొనియాడారు.తెలంగాణ ప్రాంతానికీ జరుగుతున్న అన్యాయాన్ని సమర్థంగాఎదురించి, ఎలుగెత్తి చాటిన మహనీయుడు అని ఆయన అన్నారు.

Also Read : పనులుపూర్తి చేసేలా తక్షణ చర్యలు తీసుకోండి

మలి దశ ఉద్యమానికి సిద్ధాంతకర్తగా నిలిచిన ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ సార్ వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘన నివాళులు అర్పించడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమ నాయకుడని,తెలంగాణ వాదాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడుఅనితెలంగాణ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ జోగుళాంబ గద్వాల జిల్లా ప్రెసిడెంట్ జయప్రకాశ్ అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ స్వప్న, సూపర్ వైజర్ హెలెన్, నవనీతం, రామకృష్ణ హెల్త్ అసిస్టెంట్ రంజిత్ కుమార్ స్టాఫ్ నర్స్ లు ఏ ఎన్ ఎమ్ లు ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube