దేశ భక్తి పెంపొందెలా వేడుకలు

ప్రతి ఇంటికి ఉచితంగా జాతీయ జండా

1
TMedia (Telugu News) :

దేశ భక్తి పెంపొందెలా వేడుకలు
– ప్రతి ఇంటికి ఉచితంగా జాతీయ జండా
టీ మీడియా,ఆగస్టు 8,సత్తుపల్లి: దేశభక్తి, జాతీయ స్ఫూర్తి పెంపొందేలా స్వాతంత్య్ర పోరాట యోధుల త్యాగాలను, స్వాతంత్య్ర పోరాట చరిత్రను తెలిపేలా స్వతంత్ర్య భారత వజోత్సవ ద్విసప్తహా వేడుకలు ఘనంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారు సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు.

 

Also Read : అక్రమంగా వెదురు రవాణా

 

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటిపై జాతీయ జెండాలను ఎగురవేయాలన్నారు. ప్రతి ఇంటికి జాతీయ జెండాను ఉచితంగా పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు. ఈ నెల 8 నుంచి 21 వరకు వజ్రోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 8న సీఎం కేసీఆర్ హైదరాబాద్ లో వజోత్సవాలను ప్రారంభిస్తారని.. ఈ నెల 9 నుంచి జిల్లాలో ఆయా శాఖలకు కేటాయించిన కార్యక్రమాలను అధికారులు సమన్వయంతో విజయవంతంగా నిర్వహించాలని ఎమ్మెల్యే సండ్ర అన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube