సావిత్రి బాయి పూలే వర్ధంతి వేడుకలు.
టి మీడియా మార్చి 10 లక్షెట్టిపేట :
సావిత్రిబాయి పూలే ఆశయాలను నిరంతరం కొనసాంచాలని అంబేద్కర్ యువజన సంఘము మండల అధ్యక్షులు దొంత నర్సయ్య పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో సావిత్రిబాయి పూలే 125 వ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు.
Also Read : ఘోర రోడ్డు ప్రమాదం.
ఈ సందర్బంగా అయన మాట్లాడారు. భారతదేశంలోనే మొట్టమొదటి సారి బీసీ, ఎస్సీ, ఎస్టీ లకు చదువు నేర్పిన మహిళా ఉపాధ్యాయురాలు అని ఆమె సేవలను కొనియాడారు. సావిత్రి బాయి జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆమె జయంతి వర్థంతిని ప్రభుత్వాలే అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘము నాయకులు అవునూరి లచ్చన్న, చిప్పకుర్తి నారాయణ, శెనిగారం లింగన్న, మాలేం చిన్నన్న, తోటపల్లి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.