క్షమాపణలు చెప్పిన కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ

క్షమాపణలు చెప్పిన కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ

1
TMedia (Telugu News) :

క్షమాపణలు చెప్పిన కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ

టీ మీడియా, నవంబర్ 9, భోపాల్‌ : జాతీయ రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. మధ్యప్రదేశ్‌లో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆ రాష్ట్ర హైవేపై ఒక చోట అధ్వాన్నంగా నిర్మించిన రోడ్డుపై సారీ చెప్పారు. ఆ ప్రాజెక్టును కొత్త కాంట్రార్టర్‌కు అప్పగించినట్లు వెల్లడించారు. జబల్‌పూర్‌లోని మండలలో సోమవారం జరిగిన కార్యక్రమంలో రూ.1,261 కోట్ల విలువైన ఐదు జాతీయ రహదారుల ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ‘నాకు బాధగా ఉంది. నేను చాలా విచారం వ్యక్తం చేస్తున్నా. పొరపాటు జరిగితే క్షమాపణ చెప్పడానికి నేను వెనుకాడను.

Also Read : మంత్రికి ఘన స్వాగతం

మండల- జబల్‌పూర్ హైవేలో 63 కిలోమీటర్ల మేర బరేలా నుంచి మండలానికి రూ.400 కోట్లతో రహదారిని నిర్మించాం. అయితే దానిపై నేను సంతృప్తి చెందలేదు. మీలో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడకు రాక ముందే నా అధికారులతో మాట్లాడాను. ఆ కాంట్రాక్టర్‌ను తప్పించి కొత్తగా టెండర్‌ పిలవాలని చెప్పా. త్వరలో మంచి రోడ్డు అందుబాటులోకి వస్తుంది. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న ఇబ్బందులకు నేను క్షమాపణలు కోరుతున్నాను’ అని అన్నారు. దీంతో ఆ సభకు హాజరైన ప్రజలు చప్పట్లతో గడ్కరీ నిజాయితీని అభినందించారు.

ప్రకటన : 

టీ మీడియా లో రాష్ట్రం లోని వివిధ విభాగాల్లో ప్రాంతాలు,జిల్లాల మండలాలు వారీగా పని చేయడానికి ప్రతి నిధులు కావాలి.అర్హత, మార్కెటింగ్/మీడియా రంగం లో అనుభవం,ఇంటర్ అపైన చదువు కొన్న వారు అర్హులు. ఇన్సెంటివ్స్ ఇవ్వబడడును.గృహిణులు కూడా ధరకాస్తు లు చెయ్యవచ్చు..ఆసక్తి ఉన్న వారు తమ బయో డేటా:8919710365,8500515 365 కి పంపండి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube