కుంట కేంద్రంగా కోడిపందాల జోరు

ఆంధ్ర నుండి వందలాది జూదరులు హాజరు

0
TMedia (Telugu News) :

కుంట కేంద్రంగా కోడిపందాల జోరు

– ఆంధ్ర నుండి వందలాది జూదరులు హాజరు

టీ మీడియా, జనవరి 16, చింతూరు : అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్ సరిహద్దు రాష్ట్రమైన సుక్మా జిల్లా చత్తీస్గడ్ రాష్ట్రంలోని కుంట బ్లాక్ కేంద్రంలో అధికారుల కను సన్నల్లో లక్షల రూపాయల కోడిపందాల బెట్టింగ్ జూదం కొనసాగుతుంది. శనివారం నాడు విఆర్ పురం మండలం రేకపల్లి గ్రామానికి చెందిన మహిళలు జిల్లా ఎస్పీ కు కోడిపందాలు జూదం వలన తమ కాపురాలు కూలిపోతున్నాయని. కుటుంబ తగాదాలు జరుగుతున్నాయని. తమ పుస్తెలతాడు కూడా విక్రయించి జూదానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న కుటుంబ యజమానుల వ్యసనాలను అరికట్టాలని దానికి గాను కోడిపందాలు నిర్వహణ నిలిపివేయాలని ఫిర్యాదు చేయడం జరిగింది. దీని ఫలితంగా రేకపల్లిలో ప్రతి ఏట కోట్ల రూపాయలు జరిగే జూదం నిలిచిపోవడంతో అక్కడి ప్రజలు కుంట లో జరిగే కోడిపందాలకు వందల సంఖ్యలో హాజరై నారు. ఒడిస్సా. తెలంగాణ. ఆంధ్ర. చత్తీస్గడ్ నాలుగు రాష్ట్రాల కోడి పందెం రాయుళ్లు కుంటలో జరిగే పందాలకు బారులు తీరారు. విచ్చలవిడిగా నాటు సారా. కళ్ళు దుకాణాలు. పేకాట గుండాట వంటివి కూడా యదేచ్చగా నిర్వహిస్తున్నారు. కోడి పందాల నిర్వాహకులు బిరులు కట్టి లక్షల రూపాయలు అర్జిస్తున్నారు. ఆటోలు. కార్లు. మోటార్ సైకిళ్ళు కోడి పందాలకు ప్రజలు తరలి వెళ్తున్నారు.

Also Read : క్యాలెండర్లు పంపిణీ

జాతీయ రహదారి 30 పక్కనే జరుగుతున్న కోడిపందాలు ఏ ఒక్క అధికారి గాని ప్రజాప్రతిని గా నీ కన్నెత్తి కూడా చూడటం లేదు. కోడి పందెం నిర్వాహకులు భారీ స్థాయిలో అధికారులకు తాయిలాలు ముట్ట చెప్పినట్లు సమాచారం. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి కోడిపందాల జూదం పై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube