కానిస్టేబుల్‌ పోస్టులు.. నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఎస్సెస్సీ

కానిస్టేబుల్‌ పోస్టులు.. నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఎస్సెస్సీ

1
TMedia (Telugu News) :

కానిస్టేబుల్‌ పోస్టులు.. నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఎస్సెస్సీ

టీ మీడియా,అక్టోబరు28, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేసే స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌.. సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ (సీఏపీఎఫ్‌), ఎస్‌ఎస్‌ఎఫ్‌, నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో వంటి విభాగాల్లో కానిస్టేబుల్‌ (జీడీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఆసక్తి కలిగినవారు వచ్చే నెల 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈనోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 24,205 జనరల్‌ డ్యూటీ కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ చేస్తున్నది.

Also Read : కేటీఆర్‌ చొరవతో స్వదేశానికి దుబాయ్‌ బాధితులు

ఇవి బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌), సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌, ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ), సహస్త్ర సీమాబల్‌ (ఎస్‌ఎస్‌బీ), సెక్రటేరియట్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (ఎస్‌ఎస్‌ఎఫ్‌), అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మ్యాన్‌ విభాగాల్లో ఖాళీగా ఉన్నాయి. కంప్యూటర్‌ ఆధారిత రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube