కేంద్ర ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోండి

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 21 వనపర్తి : వనపర్తి జిల్లా పెబ్బేరు రూరల్ మండలం రంగాపురం గ్రామం బిజెపి రూరల్ మండల అధ్యక్షుడు భగవంతుయాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం లిక్కర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ పథకాల గురించి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా కార్మికుల కోసం నరేంద్రమోడీ ఈ శ్యామ్ పేరుతో కొత్త పథకాన్ని తీసుకు రావడం జరిగింది. ఐదు సంవత్సరాల కాలపరిమితి కార్మికులు తమ పేరును నమోదు చేసుకొని ఏమైనా ప్రమాదాలకు గురైన ప్పుడు ఇన్సూరెన్స్ పొందే అవకాశం కలిగిన పథకాన్ని కార్మికుల కోసం తీసుకురావడం జరిగింది.

వీటిని కార్మికులందరూ ఉపయోగించుకోవాలని అదేవిధంగా ఐదులక్షల ఇన్సూరెన్స్ ఉండే ఆయుష్మాన్ భారత్ పథకంలో సభ్యులుగా చేరాలని ఆరోగ్య భద్రత కోసం నరేంద్రమోడీ ఈ పథకం తీసుకురావడం జరిగిందని బీజేపీ యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు అనుజ్ఞరెడ్డి, వనపర్తి నియోజకవర్గ కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్, కిసాన్మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్రావు, బిజెపి సీనియర్ నాయకులు విజయ్ కుమార్, ఓబీసీ మోర్చా సోషల్ మీడియా ఇంచార్జ్ శివకుమార్ కార్మికులను కోరడమైనది. రాబోయే కాలంలో తెలంగాణలో బిజెపిని అధికారంలోకి తీసుకురావాలని కార్మికులు అందరూ కూడా ఐక్యం కావాలని వారు కోరారు.

Under the Patronage of BJP Rural Mandal President Bhagwantu Yadav, Ragapuram village.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube