హైదరాబాద్ చేరుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా

హైదరాబాద్ చేరుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా

1
TMedia (Telugu News) :

హైదరాబాద్ చేరుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా
టి మీడియా,మే14,హైదరాబాద్:
కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైద‌రాబాద్ చేరుకున్నారు. శ‌నివారం మ‌ధ్యాహ్నం ఢిల్లీలో బ‌య‌లుదేరిన ఆయ‌న కాసేప‌టి క్రితం న‌గ‌రంలోని బేగంపేట విమానాశ్ర‌యంలో దిగారు. ఈ సంద‌ర్భంగా అమిత్ షాకు బీజేపీ తెలంగాణ శాఖ‌కు చెందిన నేత‌లు సాద‌రంగా స్వాగ‌తం ప‌లికారు. ఎమ్మెల్యేలు, ఈటల, రాజాసింగ్, రఘునందన్ రావు, విజయశాంతి, డికే అరుణ తదితరులు అమిత్ షాకు స్వాగతం పలికారు.

Also Read : సబ్ స్టేషన్ పనులను పరిశీలించిన మాజీ ఎంపీ సోడే

కాగా, అమిత్ షా సీఎఫ్ఎస్ఎల్ క్యాంపస్‌లో కొత్త‌గా ఏర్పాటు చేసిన‌ నేష‌న‌ల్ సైబ‌ర్ ఫోరెన్సిక్ ల్యాబోరేట‌రీని ప్రారంభించ‌నున్నారు. ఆ త‌ర్వాత తెలంగాణ బీజేపీ కోర్ క‌మిటీ నేత‌ల‌తో అమిత్ షా భేటీ కానున్నారు. అనంతరం తుక్కుగూడ‌లో జ‌ర‌గ‌నున్న బండి సంజ‌య్ పాద‌యాత్ర ముగింపు కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వుతారు. ఆ కార్య‌క్ర‌మం తర్వాత అమిత్ షా ఢిల్లీకి తిరుగు ప‌య‌నం కానున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube