ఆర్టీసీని అమ్మాలని కేంద్రం లెటర్లు పంపుతోంది

రాజ్యాంగ స్ఫూర్తిని మోదీ ప్రభుత్వం కాలరాస్తోంది

1
TMedia (Telugu News) :

ఆర్టీసీని అమ్మాలని కేంద్రం లెటర్లు పంపుతోంది

– రాజ్యాంగ స్ఫూర్తిని మోదీ ప్రభుత్వం కాలరాస్తోంది

– తలసరి విద్యుత్‌ 1255 యూనిట్లు ఉండడం సిగ్గుచేటు

– అసెంబ్లీ లో సీఎం కేసీఆర్‌

టీ మీడియా,సెప్టెంబర్ 12, హైదరాబాద్‌: ఆర్టీసీని అమ్మేయని కేంద్రం లేఖలు రాస్తోందని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో అన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో విద్యుత్‌ సంస్కరణలపై జరిగిన స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్రం విధానాలపై ధ్వజమెత్తారు. ‘మీటర్‌ పెట్టకుండా విద్యుత్‌ కనెన్షన్‌ ఇవ్వొద్దని కేంద్రం తీసుకువచ్చిన గెజిట్‌లోనే ఉన్నది. గెజిట్‌ నిన్నగాక మొన్న వచ్చింది. చట్టంలో లేదు.. మేము అనలేదు అంటున్నరు. ఆంధ్రప్రదేశ్‌ శ్రీకాకుళంలో మీటర్‌ పెడితే రైతులంతా కుప్పలు పోసి.. ధర్నా చేశారు. ఈ ప్రమాదం తెలంగాణకు వస్తే సర్వనాశనం అవుతుందని అక్కడికి వెళ్లి వాస్తవాలు తెలుసుకున్నం. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో తియ్యని మాటలు చెప్పారు. ఫ్రీ కరెంటు ఇస్తామన్నరు. అక్కడ మీటర్లు పెడితే మూడు నాలుగు జిల్లాల్లో రైతులంతా కరెంటు ఆఫీసుకాడ మీటర్లు పోసి.. పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి.. ఇంకా జరుగుతున్నయ్‌’ అని గుర్తు చేశారు.

 

Also Read : గ్యాంగ్‌స్ట‌ర్ల‌పై ఎన్ఐఏ దాడులు

అంబేద్కర్‌ తీసుకువచ్చిన రాజ్యాంగ స్ఫూర్తిని మోదీ ప్రభుత్వం రోజుకింత కాలరాస్తుందని సీఎం కేసీఆర్‌ ధ్వజమెత్తారు. రాష్ట్ర అసెంబ్లీలో ఇవాళ విద్యుత్‌ సంస్కరణలపై లఘు చర్చ జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు బీజేపీ తీసుకువచ్చిన విద్యుత్‌ సంస్కరణల్లో ఎక్కడా వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇవ్వొద్దని చెప్పలేదని పేర్కొన్నారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. రఘునందన్‌రావు సభను తప్పదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా కేంద్రం విధానాలను తూర్పారబట్టాను సీఎం కేసీఆర్‌. ‘ఆధునిక ప్రపంచంలో యావత్‌ ప్రపంచం కూడా ఆయా దేశాలు, నాగరిక ప్రపంచం ఆవిష్కరించేటటువంటి అభివృద్ధి అనేక కొలమానాల ద్వారా చూస్తారు. తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సమయంలో కరెంటు, దాని సరఫరా, ప్రజల పడ్డ బాధలు, దాన్ని వినియోగించే సమయంలో జరిన మరణాలకు మన అందరం ప్రత్యక్ష సాక్షులం. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఆ నాడు అనేక ప్రాంతాల్లో కరెంటు షాక్‌లు కొట్టిచనిపోవడం. బిల్లు కట్టలేదని ఎలక్ట్రిసిటీ విజిలెన్స్‌ అధికారులు విషం తాగి చనిపోవడం. భిక్షపతి అనే వ్యక్తి జమ్మికుంటలో చనిపోవడం. అక్కడికి మేము అందరం ఉద్యమ సమయంలో వెళ్లాం. వెరసి కష్టాలను ఇప్పుడు తలచుకుంటేనే భయమవుతుంది’ అన్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో తలసరి విద్యుత్‌ వినియోగం 1255 యూనిట్లు ఉండడం సిగ్గుచేటని సీఎం కేసీఆర్‌ అన్నారు.

 

Also Read : పద్మావతి అమ్మవారి ఆలయానికి స్వర్ణ పాదాలు విరాళం

అసెంబ్లీలో విద్యుత్‌ సంస్కరణలపై జరిగిన లఘు చర్చలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. ‘24 గంటల రైతు వద్దకు వెళ్లి పలకరించే పని లేకుండా.. ఎన్ని హార్స్‌ పవర్‌ పెట్టుకున్నవ్‌? అడిగే పని లేకుండా తెలంగాణ రైతులకు పవర్‌ ఇస్తున్న మాట నిజంకాదా? టీఆర్‌ఎస్‌ గవర్నర్‌ మెంట్‌ వచ్చాక ఐదున్నర నెలల్లోనే అహోరాత్రాలు పని చేసి సమస్యను పరిష్కరించాం. ప్రభాకర్‌రావు జెన్‌కో, ట్రాన్స్‌కో చైర్మన్‌గా రెండోసారి పని చేయనని, వేరేవాళ్లను పెట్టాలని చెబితే.. పని చేశారు.. అనుభవం అవసరం అని చెప్పాం. ఎక్కడెక్కడో ఉన్న వెతికి వారిని తీసుకువచ్చి.. పదవీ విరమణ చేస్తున్న సమయంలో వదిలి పెట్టి వెళ్లొద్దని నేను పర్సనల్‌ రెక్వెస్ట్‌ చేశా.. వాళ్లను సర్వీసులో పెళ్లి ఇవాళ్టి వరకు విజయవంతంగా నడుపుతున్నాం.. ఎన్ని బాధలు.. కష్టాలు వచ్చినా.. అవసరమైతే కొన్ని సబ్సిడీలు, ఇతర ఖర్చులు తగ్గించుకుందాం. పరిశ్రమలు, ఐటీ జరగాలన్న.. పరిశ్రమలు రావాలన్నా, వ్యవసాయ ఉత్పత్తులు పెరగాలన్నా.. రాష్ట్రాభివృద్ధి జరగాలన్నా.. మనకు వచ్చే పన్నులు పెరగ్గాలన్నా విద్యుత్‌ రంగం కీలకమైంది’ అన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube