కేంద్ర ,రాష్ర్ట ,ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయి

కేంద్ర ,రాష్ర్ట ,ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయి

1
TMedia (Telugu News) :

కేంద్ర ,రాష్ర్ట ,ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయి
టీ మీడియా మార్చి 31,పెద్ద శంకరంపేట:తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని పెద్ద శంకరంపేట్ మండలం లో పీసీసీ ఉపాధ్యక్షుడు సురేష్ కుమార్ షెట్కార్ పిలుపు మేరకు .కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వంటగ్యాస్ సిలిండర్, పెట్రోల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేయడం జరిగిందని కాంగ్రెస్ నాయకులు మధు అన్నారు.ఆయన మాట్లాడుతూ విద్యుత్ యునిట్ ధర,43 నుండి 90శాతంపెంచడం ఎంతవరకు సమంజసమని తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరెంటు చార్జీలు, వంట గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేసి సిలిండర్ లకు పులా మాల వేసి డప్పు వాయించి నిరసన కార్యక్రమం చేపట్టారు. అలాగే కరెంటు చార్జీలు తక్షణమే తగ్గించాలని విద్యుత్ శాఖ వారికి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జనార్దన్ శంకరంపేట్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాయిని మధు . శంకరంపేట్ టౌన్ అధ్యక్షుడు గంగారెడ్డి , సత్యనారాయణ మడిశెట్పల్లి సాయిలు ,రవి, రాంచెందేర్, రొమాల సాయిలు, వసీం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Also Read : ప్రభుత్వ పాఠశాలలను ఆంగ్ల మాధ్యమంతో బలోపేతం చేయాలీ

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube