ఖోఖో, వాలీబాల్, అతే లేటిక్స్ పోటీలు

0
TMedia (Telugu News) :

టీ మీడియా, నవంబర్ 21, మహానంది:

మహానంది మండలములోని సిఇఓ, సెట్కర్ కర్నూలు జిల్లా వారి ఆదేశాల మేరకు, అన్ని గ్రామాలలో ఉన్న కబడ్డీ, ఖోఖో, వాలీ బాల్, అతే లేటిక్స్ క్రీడాకారుల 23/11/2021 వ తేది మంగళవారం ఉదయం 9:౦౦ గంటలకు మహానంది మండల కేంద్రమైన యం .తిమ్మాపురం లోని జట్పి ఉన్నత పాఠశాల యందు ఎపి సిఎం కప్ మండల స్థాయిలో టోర్నమెంట్స్ / సెలక్షన్ కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది అని ఎంపిడిఓ సుబ్బరాజు తెలిపారు.

ఇక్కడ ఎంపిక అయిన క్రీడాకారులు ఆత్మకూరు నియోజకవర్గ (ఆత్మకూరు) స్థాయిలో పాల్గోనవలసి ఉంటుందన్నారు. ఈ క్రీడల్లో పాల్గొనే వారి వయస్సు పదహారు సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలన్నారు. వరికి బరువుతో సంబంధం లేదు. కావున, మండలంలో ఉన్న ఆసక్తి గల క్రీడాకారులందరూ మహానంది మండల కేంద్రమైన యం. తిమ్మాపురం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు సిఎం కప్ సెలక్షన్ కార్యక్రమం లో పాల్గొని, ఈ అవకాశమును సద్వినియోగం చేసుకోవలసినదిగా ఎంపిడిఓ సుబ్బ రాజు, ఫీజికల్ డైరెక్టర్ వీర రాఘవయ్య కోరారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube