సర్టిఫికెట్స్ ప్రధానోత్సవం

సర్టిఫికెట్స్ ప్రధానోత్సవం

1
TMedia (Telugu News) :

సర్టిఫికెట్స్ ప్రధానోత్సవం

టి మీడియా, మే 23,ఖమ్మం : వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్లెన్స్ ఆధ్వర్యంలో రెండు నెలల పాటు బ్యూటీషియన్ కోర్సు పూర్తి చేసిన మహిళకు సర్టిఫికెట్స్ లు ప్రధానోత్సవం చేశారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ శ్రీమతి పద్మజ హాజరై మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని , తమ కాళ్ళపై నిలబడి ఉద్యోగ వ్యాపార రంగాలలో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు . ప్రస్తుత పరిస్థితుల్లో బ్యూటిషన్ కోర్స్ చాలా మంచి డిమాండ్ ఉందని , క్రమశిక్షణతో మంచి నైపుణ్యం సాధించి భవిష్యత్తులో మంచి స్థానానికి ఎదగాలని అభిలషించారు.అర్హులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా లోన్ సదుపాయాని ఇస్తామని కూడా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విహే సంస్థ వ్యవస్థాపకులు దేవకి వాసుదేవరావు మాట్లాడుతూ ఖమ్మంలో వివేకానంద ఇన్స్టిట్యూట్ ద్వారా గత పది సంవత్సరాలుగా అనేకమంది నైపుణ్యం సాధించి ఉద్యోగం మరియు వ్యాపార రంగంలో అవకాశాలు పొందారని , భవిష్యత్తులో మరికొంతమందికి ఈ శిక్షణా కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.

Also Read : రైట్ ఛాయిస్ , పే బ్యాక్ సొసైటీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం

మోటివేషన్ , దృఢసంకల్పంలతో ముందుకు నడవాలని , మీరు మరో నలుగురికి ఉపయోగపడినప్పుడే నేర్చుకున్న విద్యకు , నేర్పిన గురువు కు మరియు ఇన్స్టిట్యూట్ కు మిరు ఇచ్చే గురుదక్షిణ అన్ని అన్నారు . పది వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా మినిమం పది వేల మందికి శిక్షణ తరగతులు ఇవ్వాలని , స్వయం ఉపాధికి వృత్తి నైపుణ్యంలో తీర్చిదిద్దడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని పేర్కొన్నారు . మరో ముఖ్య అతిథిగా హాజరైన స్కిల్ డెవలప్మెంట్ కో – ఆర్డినేటర్ మీనాక్షి వివేకానంద ఇన్స్టిట్యూట్ చేస్తున్న సేవలను కొనియాడారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారందరూ మంచి నైపుణ్యాన్ని సాధించి వాళ్ల కుటుంబాలకు చేదోడువాదోడుగా ఉంటూ మహిళలు ముందుకు సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కేశవ లాల్ పటేల్ , గన్నవరపు చంద్రశేఖర్, జయంతి పటేల్ , సత్యనారాయణ సింగ్ , రాముడు , రాగిణి ట్రైనర్ మంజుల తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube