రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ గా అజయ్ మిశ్రా బాధ్యతల స్వీకరణ

రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ గా అజయ్ మిశ్రా బాధ్యతల స్వీకరణ

1
TMedia (Telugu News) :

రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ గా అజయ్ మిశ్రా బాధ్యతల స్వీకరణ
టీ మీడియా,ఎప్రిల్ 01,హైదరాబాద్: రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ శాఖ గౌరవ చైర్మన్ గా విశ్రాంత ఐఏఎస్ అధికారి అజయ్ మిశ్రాను తెలంగాణ రాష్ట గవర్నర్ అండ్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ నియమించారు. ఉమ్మడి రాష్ట్రంలో పలు కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయన రెండున్నరేళ్ల క్రితం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాతో పదవి విరమణ చేశారు. ఈ సందర్బంగా గురువారం రోజున రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ శాఖ ప్రధాన కార్యాలయం లో పదవి బాధ్యతలు తీసుకున్నారు.ఈ కార్యక్రమం లో వరంగల్ అర్బన్ జిల్లా నుండి రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ పి. విజయచందర్ రెడ్డి, రాష్ట్ర పాలకవర్గ సభ్యులు శ్రీనివాస్ రావు పాల్గొని భద్రకాళి అమ్మవారి చిత్రపటం. ప్రసాదం అందచేసి శుభాకాంక్షలు తెలిపారు.

Also Read : ఒక కుటుంబానికి ఒకే పింఛన్‌ దారుణం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube