పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మండలి చైర్మన్
– గుత్తా సుఖేందర్‌రెడ్డి
టీ మీడియా, అక్టోబర్ 5, నల్లగొండ : జిల్లాలోని మిర్యాలగూడ నియోజకవర్గం మాడ్గులపల్లి మండలం పరిధిలో పంచాయత్ రాజ్ శాఖ నిధులు 60 లక్షల రూపాయలతో కుక్కడం గ్రామం నుంచి పూసలపహాడ్ గ్రామం వరకు 3.8 కిలోమీటర్ల మేర నూతన రోడ్ నిర్మాణ పనులకు గురువారం శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్థానిక శాసన సభ్యుడు నల్లమోతు భాస్కర్ రావుతో కలిసి శంకుస్థాపన చేసారు. అనంతరం గ్రామ సర్పంచ్ అలుగుబెల్లి గోవింద్ రెడ్డి అద్వర్యంలో 100 మంది బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే భాస్కర్ రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కుక్కడం గ్రామానికి అనేక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే బీఆర్‌ఎస్‌లో చేరుతుపన్నారని చెప్పారు.
Also Read : ర్టీలకు అతీతంగా డబుల్ పఇండ్ల పంపిణీ
ఈ కార్యక్రమంలో ఎంపీపీ పోకల శ్రీవిద్య రాజు, జిల్లా కో ఆప్షన్ సభ్యుడు మోసిన్ అలీ, మండల పార్టీ అధ్యక్షుడు పాలుట్ల బాబయ్య, పాక్స్ చైర్మన్ జెర్రిపోతుల రాములు గౌడ్, మాజీ ఎంపీటీసీ పుట్ట పద్మ, గుడే సత్యనారాయణ శర్మ, రాబర్ట్, మస్తాన్, రామస్వామి, శ్రీను, సోమయ్య, జానయ్య, జాఫర్ తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube